Monday, December 13, 2010

సోషల్ నెట్‌వర్క్ సినిమా

ఫేస్‌బుక్ స్థాపించిన మార్క్ జకర్‌బర్గ్ జీవితం ఆధారంగా తీసిన సినిమా. ఏదో ఫిలిం ఫెస్టివల్ గొప్ప కామెంట్లు వచ్చాయని చదివి, కుర్రవాడికి ఆటోబయాగ్రఫీ ఏంటి అంత సీన్ ఏముంటుందబ్బా? అనుకున్నాను.
ఇది జకర్బర్గ్ కథ కాదు ఫేస్‌బుక్ కథ. ఒక హార్వర్డ్ విశ్వవిద్యాలం హాస్టల్లో మొదలయిన చిన్న వెబ్‌సైట్ ప్రపంచాన్నే ఒక ఊపు ఊపుతున్న ఫేస్‌బుక్ గా మారడంలో జరిగిన సంఘటనలు, అందులో ఇన్వాల్వ్ అయిన మనుషులు వాళ్ళ దృక్పథాల్లో గ్రే షేడ్స్.. సినిమా చూశాక వావ్ అనకుండా ఉండలేం. టెక్నాలజీ ప్రియులు, స్టార్టప్ కలలు కనే ఎంటర్‌ప్రెన్యూర్స్, ఎంబీయేలూ తప్పక చూడవలసిన సినిమా.

ఫేస్‌బుక్ స్థాపకుల గురించి తెలీని వారికి టూకీగా (కథ అస్సలు తెలుసుకోవద్దంటే ఈ పేరా చదవడం స్కిప్ చేయండి.)
మార్క్ జకర్బర్గ్, ఎడ్వార్డో సావరిన్, హార్వార్ద్లో ఫస్టియర్ చదువుకునే విద్యార్థులు, రూమ్మేట్స్. హార్వార్డ్లో చాలా మందిలాగే అమిత మేధావులు. తన ఇన్వెస్ట్మెంట్ మేధస్సుతో ఇంటర్ అయ్యాక 300,000 సంపాదిస్తాడు ఎడ్వార్డో. హార్వార్డ్ ఫినాన్షియల్ క్లబ్ కి ప్రెసిడెంట్. జకర్బర్గ్ ఒక గీక్. గర్ల్‌ఫ్రెండ్తో గొడవపడి తనమీద కసితో ఒక వెబ్‌సైట్ రాత్రికి రాత్రే పెట్టి, ఆ సైటుకు వచ్చిన ట్రాఫిక్ వల్ల రాత్రికి రాత్రే నెట్‌వర్క్ డౌన్ చేస్తాడు మార్క్. అతని ప్రోగ్రామింగ్ స్కిల్స్ గమనించిన ముగ్గురు సీనియర్ విద్యార్థులు (వింకిల్వాస్ కవలలు, దివ్య నరేంద్ర) వాళ్ళకున్న ఒక ఐడియ మార్క్తో చెప్పి పార్ట్నర్ అవమంటారు. ఆ ఐడియాలో గొప్పదనం గ్రహించిన మార్క్ వాళ్ళకు పనిచేయకుందా తనే ఫేస్‌బుక్ అని ఒక సైట్ ప్రారంభిస్తాడు ఎడ్వార్డో సహాయంతో.
ఇది మేధోహక్కులను దొంగిలించడమని వింకిల్వాస్ బ్రథర్స్ మార్క్ ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఫేస్‌బుక్ ఒక వైపు శరవేగంతో విస్తరిస్తుంటుంది. ఫస్టియర్ హాలిడేస్ లో మార్క్ కాలిఫోర్నియా వెళ్ళి మరో ఇంటరెస్టింగ్ వ్యక్తితో చేతులు కలుపుతాడు. ఎడ్వార్డో కు అదెంతమాత్రమూ ఇష్టముండదు. అక్కడనుండి కథ రకరకాల మలుపు తిరిగి ఇప్పుడున్న ఫేస్‌బుక్ ఎలా తయారయిందో మనకు తెలుస్తుంది.
ముందే చెప్పినట్టు ఇదంతా ఐ.టీ ఉద్యోగులకూ, ఎంబీయే వాళ్ళకి, కార్పొరేట్ మేనేజర్లకు వావ్ అనిపించే సినిమా. సరదాగా ఏదో సినిమా చూద్దామంటె మాత్రం నిరాశకు గురవ్వక తప్పదు.
సినిమాలో ఆకట్టుకునేది డైలాగ్స్, నేపథ్య సంగీతం, నటులందరి నటన. ముఖ్యంగా జస్టిన్ టింబర్లేక్ నటన. వీడికి ఇంత సీనుందా అనిపించాడు.

నాకైతే సినిమాలో బోలెడు విషయాలు నచ్చాయి. ముఖ్యంగా ఈ గొడవలో కనీసం నాలుగు పార్టీలున్నాయి. మార్క్, ఎడ్వార్డో, వింకిల్వాస్, షాన్ లెస్టర్. ఎవరినీకూడా పునీతులుగా చూపించడు. అలా అని అందరి వాదనలోనూ కాస్తో కూస్తో నిజముంది. ఆ గ్రే షేడ్స్ చూపించిన తీరు అద్భుతం. ఇది ఎడ్వార్డో చెప్పిన కథ/పుస్తకం ఆధారంగా నిర్మితమైన సినిమా. అందుకేనేమో ఎడ్వార్డో పాత్ర ఒక్కటే ఏ తప్పూ చేయనట్టు ఉంటుంది

చాలా రోజులుగా హైదరాబాదులో ఆడుతోందీ సినిమా. కుదిరితే తప్పక చూడండి.