1) వనవాసి : విభూతి భూషణ్ బంధోపాధ్యాయ బెంగాలీ నవల అరణ్యక కు అనువాదం. పథేర్ పాంచాలి నవల రాసినది ఇతనే. పుస్తకం.నెట్ లొ సుజాత గారి పుస్తకపరిచయం చూసి కొన్నాను. అద్భుతమైన పుస్తకం. ఈ నగరాన్ని విడిచి పారిపోవాలనిపిస్తుంది చదువుతుంటే. చదివినంతసేపూ మనమూ అడవుల్లో, వెన్నెల్లో విహరిస్తుంటాం. "బహుళపంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను" గుర్తుకువస్తుంది వెన్నెల్లో అడవిని వర్ణిస్తుంటే అలాగే గర్భదారిద్ర్యవర్ణన చదువుతుంటే వొళ్ళు గగుర్పొడుస్తుంది. కథ-పరిచయానికి పుస్తకం.నెట్లో సుజాత గారి వ్యాసం చదవండి. తప్పకుండా చదవాల్సిన పుస్తకం. అనువదించినవారు సూరంపూడి సీతారాం గారుట. ఎంత చక్కని అనువాదమో. అసలు పుస్తకం తెలుగులో రాశారంటే నమ్మొచ్చు. వీలైతే ఈయన మిగిలిన అనువాదాలు సంపాదించాల్సిందే.
పుస్తకం ప్రచురించిన హైదరబాద్ బుక్ ట్రస్టు మీద మాత్రం కినుక వహించాల్సిందే. 120 రూపాయల ధర పెట్టి ఇంత చీప్ క్వాలిటీ ముద్రణా.? HBT, having published a book myself I know how much it cost and pricing models. There is no way you can justify the price. ఈ పుస్తకానికి మంచి ఆర్టిస్టు వేసిన చిత్రాలు జోడించి బైండు పుస్తకంగా ఎవరైనా పబ్లిష్ చేస్తే కొనుక్కోవాలనుంది. సుజాత గారు, ఇంత మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
2) కొండఫలం - వాడ్రేవు వీరలక్ష్మీదేవి కథల సంకలనం : కొండఫలం కథ కథా సిరీస్లో చదివినట్టు గుర్తు. అందుకే మారాలోచించక తీసుకున్నాను. అన్నీ స్త్రీవాద కథలు. అలాగని మితిమీరిన మూర్ఖవాదం కాదు. కథలకి చదివించే గుణం, మంచి కథా వస్తువు ప్రధానం అనుకుంటే, ఈ సంకలనంలో ప్రతి కథకు ఆ లక్షణముంది. కథలు - స్త్రీవాదం ఇష్టపడేవారు కొనుక్కోవచ్చు. చికాకు పెట్టిన రెండు చిన్న విషయాలు. senisitve కీ sensible కి రచయిత్రికి తేడా తెలీకపోవడం.(పుట.121). ఉజ్జ్వల అనే కథలో ప్రొటగనిస్టు డయలాగు "నేను వాక్‌మన్ అనను వాక్‌పర్సన్ అంటాను. లాంటివి.. వెల 90/-
3) అనగనగా..మరి కొన్ని కథలు - రచన :బ్నిం : టైటిల్ నాకు సరిగా గుర్తులేదు ఐదేళ్ళక్రింద బ్నిం గారిది ఒకపుస్తకం వచ్చింది. భార్యభర్తల మధ్య పొరపొచ్చాలు, సర్దుకోవడాలు గట్రా గురించి. నాకెంతో నచ్చింది. అదే కాంఫిడెన్స్‌తో కొన్నానీ పుస్తకాన్ని. అన్నీ చక్కని కథావస్తువులు. చాలా మట్టుకు మానవత్వం గుబాళించేవీ, కనులు చెమ్మగిల్లజేసేవీ. ఐతే కథనం మాత్రం పకడ్బందీగా ఉండదు. ఎవరో టీవీ సీరియల్ తీస్తుంటే కథను క్లుప్తంగా వివరించినట్టుంటుంది. ఆ విషయమే నాకు నచ్చలేదు. ఎంతైనా నాకు నచ్చీ, నాతో కొనిపించిన మొదటిపుస్తకమంత బాగా రాలేదు. బ్నిం పుస్తకాలు ఇంతకు ముందు చదవకపోతే ఒకసారి కొనుక్కోండి. వెల 70/-
4) అడవి పాడింది : ఆ మధ్య మనకు చక్కని సూఫీఅనువాదాలు, కన్నడ తత్వాలకు అనువాదాలు "మాటన్నది జ్యోతిర్లింగం" అందించిన దీవి సుబ్బారావు గారి రచన. చిన్నచిన్న పిట్టకథలు. చదువుతుంటే కాసేపు "చికెన్ సూప్ ఫర్ ద తెలుగు సోల్" చదువుతున్నట్టూ, కాసేపు తాతగారితో కబుర్లు చెబుతున్నట్టూ ఉంటుంది. కొన్నేమో పుక్కిటి పురాణాలు, కొన్ని యధార్త ఘటనలు, కొన్ని జెన్ కథలు..అన్నీ కలగా పులగంగా ఉన్నాయి. నాకైతే నచ్చలేదు. చాలామందికి నచ్చవచ్చు. పుస్తకాలకొట్టులో రెండు మూడు పేజీలు తిరగేసి నచ్చితే కొనుక్కోండి. వెల 60/-
5) బంజార : ఇక్బాల్ చంద్: ఇక్బాల్ చంద్ నిస్సందేహంగా బలమైన కవి. ఈ పుస్తకం గురించి వీలైతే పుస్తకం.నెట్లో వ్యాసం రాయాలని ప్లాను. అప్పటిదాకా వేచి చూడండి. :-)
Showing posts with label పుస్తకాలు. Show all posts

Saturday, March 06, 2010
Thursday, January 28, 2010
తిమ్మరుసు పుస్తకం
టైటిల్ చూసి మంచి పుస్తకం ఆనవాలు దొరికిందనుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్లే.
గుమ్మడిగారు పోయారని ఈటీవీలో "మహామంత్రి తిమ్మరుసు" సినిమా వేస్తున్నారు. ఈ సినిమా చూస్తోంటే మనసు అలా వలయాల్లోకి వెళ్ళి ఎక్కడో ఒక చిన్నప్పటి ఆదివారం మధ్యాహ్నం దగ్గర ఆగిపోయింది. ఏడెనిమిదేళ్ళ వయసప్పుడనుకుంటా. ఒకరోజు అమ్మతో పాటు ఎవరో తెలిసినవాళ్ళింటికి వెళ్ళాను. వెళ్ళిన ఇంటావిడ గర్ల్స్ హైస్కూల్లో హిందీ టీచరు. వాళ్ళింట్లో పిల్లలెవరూ ఉండరు. ఆవిడ వాళ్ళబ్బాయి ఇద్దరే ఉండేవాళ్ళు. ఆ అబ్బాయి ఏ పదో తరగతో పధ్నాలుగో తరగతో చదివేవాడు. నేను ససేమీరా వెంటరానని మారాం చేస్తే ఒక అరగంట పని చూసుకొని తిరిగి వచ్చేయాలని ఒప్పందం కుదుర్చుకుని వెంటతీసుకొని పోయింది అమ్మ. తీరా అక్కడికి వెళ్ళాక తేలిందేమంటే ఆవిడ పాపం అమ్మనెక్కడికో తోడుకు తీసుకెళ్ళాలని పిలిచాలట. నేనక్కడ అనవసరంగా ఉన్నానని అర్థమయ్యింది.వాళ్ళ వెంట వెళ్ళడానికి లేకా, ఇంటికి వెళ్ళడానికి లేకా నేనక్కడ ఇరుక్కున్నాను. నా ఆదివారం మధ్యాహ్నం అలా చట్టుబండలైనందుకు అమ్మ మీద కోపంతో గుర్రుగా చూస్తున్నాను. పాపం అమ్మ ఎలాగో ఊరడించి, ఎవేవో వాగ్దానాలు చేసి ఏదైనా కథల పుస్తకం చదువుతూ కూర్చో అని ఆవిడని అడిగారు. ఏవైనా ఉన్నాయా అని? వాళ్ళింట్లో బోల్డన్ని హిందీ పుస్తకాలున్నాయి. నాకింకా హిందీ అ, ఆ లు మాత్రమే వచ్చు. నీరసపడిపోయి వెతుకుతూ ఉంటే వాళ్ళబ్బాయి తెలుగు ఉపవాచకమొక్కటి కనిపించింది. అప్పాజీయో తిమ్మరుసో టైటిల్ సరిగా గుర్తు లేదు. సరే ఏదో ఒకటి అని చదువుతూ కూర్చున్నాను. ఎంత అద్భుతమైన పుస్తకమది. అసలు నాకు టైమూ అవీ గుర్తుంటేగా.. అలాగే చదువుతూ వాళ్ళింట్లో ఉండిపోయాను. రెండు గంటనుకున్న వాళ్ళ పని నాలుగ్గంటలయ్యింది. వాళ్ళబ్బాయి ఏదో పరీక్షకు చదువుతూ నన్ను పట్టించుకోలేదు. నేను తనని పట్టించుకోలేదు. బోల్డంత సమయం గడిచాక అయ్యో ఆలస్యమయిందంటూ కంగారు పడుతూ అమ్మ వచ్చేసింది. కంప్లైంట్లు లేవు అలకల్లేవూ. (మరి నేను విజయనగరసామ్రాజ్యంలో ఉన్నా కదా) ఇంటికి వెళ్తుంటే విచారంగా ఉన్న నన్ను చూసి చెబుతోంది అమ్మ. అనుకోకుండా ఆలస్యమైందిరా సారీ అని. నేనింకా తిమ్మరుసు ముగింపునుంది కోలుకోలేక పాపం, అప్పాజీ కళ్ళు పొడిచేయడం తప్పుకదమ్మా అని బాధపడుతూ అడిగాను. విషయం గ్రహించి చిన్నగా నవ్వుకుంటూ సందేహనివృత్తి చేసింది అమ్మ.
వలయాలు మళ్ళీ వెనక్కి తిప్పితే... కాస్త పెద్దయ్యాక ఆ పుస్తకం కోసం ఎంతో వెతికాను. అది ఒక తెలుగు ఉపవాచకం పుస్తకమని తెలుసు కానీ కనీసం ఏ తరగతి ఉపవాచకమో కూడా తెలీదు. రచయిత అంతకన్నా తెలీదు. ఎవరికైనా నేను ఏ పుస్తకం గురించి మాట్లాడుతున్నానో తెలిస్తే కాస్త చెబుదురూ...ప్లీజ్.

Thursday, December 31, 2009
ఈ మధ్య చదివిన పుస్తకాలు
1) బడి నేర్పిన పాఠాలు: పిల్లలకు పాఠాలు నేర్పుతూ తాము నేర్చుకున్న పాఠాలేమిటి? ఆంధ్రజ్యోతి-ఎమెస్కో వారు కలిసి నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలో ఎంపికైన వ్యాసాల సంకలనం. పుస్తకం చదువుతుంటే మన పాఠశాలల దయనీయ స్థితులను తలచుకొని నిర్వేదం, మనం అడుగిడేది 2010లోకేనా అన్న అపనమ్మకం, స్ఫూరి నిచ్చే కొన్ని వ్యక్తిత్వాలను చూసి ఇంకా హోప్ ఉందన్న భావం కలగలిసిపోతాయి. ఒట్టు-అన్న వ్యాసం చదివాక కళ్ళు చెమ్మగిల్లని వారుండరు. గిజుభాయి సూత్రాలను ఆచరిస్తున్న మరో కిశోరభారతి, సౌజన్యా ఎడ్యుకేషనల్ అకాడమీ గురించి మనమందరం తెలుసుకోవాలి. ఈ పుస్తకం concept గొప్పగా ఉన్నా చదువుతుంటే this could have been better in so many ways అనిపించింది. ఉదాహరణకి వ్యాసాలు చదువుతుంటే బోలెడు ప్రశ్నలు రేకెత్తుతుంటాఇ. ఆయా టీచర్లతో కొన్ని ఇంటర్వ్యూలు చేసి, స్కూళ్ళ ఫోటోలు కొన్ని ప్రచురిస్తే బాగుండేది. ఇంత చక్కని కాన్సెప్టుకు ఫాలో అప్ ఏమిటి? అన్న ప్రశ్నకూడా మదిని తొలుస్తుంది. చిన్న చిన్న లోపాలున్నా తప్పక చదవాల్సిన పుస్తకం.
(ఎమెస్కో ప్రచురణలు, వెల 50/-)
2) కథా కేరళం : తకళి శివశంకరపిళ్ళై నవల "చెమ్మీన్" అనువాదం "రొయ్యలు" చదివినప్పటినుండి ఆయన పుస్తకాలు ఇంకేవైనా చదవాలని అనుకున్నాను. బుక్‌ఫెస్ట్‌లో ఈ కథల అనువాదం చూసి వెంటనే కొన్నాను. ఒక తరం కేరళ కథకుల కథలు సంకలించి అనువదించిన పుస్తకం. మలయాళ కథా సాహిత్యానికి పరిచయదీపిక లాంటిది. పదిహేను కథల సంకలనం. ఎక్కువభాగం మంచి కథలే. కథా సాహిత్యంలో ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పక చదవాలి. ఇక ఈ సంకలనంలో ఒకే ఒక యువ రచయిత కథ ఉంది. సమకాలీన సాహిత్యం ఎలా ఉందో తెలీదు కాని, ఇవి చదువుతుంటే మన తెలుగు కథ ఇంచుమించు ఇదే స్థాయిలో ఉందని అనిపించింది.
(వెల 75/- విశాలాంధ్ర/నవోదయల్లో దొరుకుతుందిట)
3) నిద్రితనగరం : వైదేహీ శశిధర్ కవితలగురించి బ్లాగ్లోకంలో ఆల్రెడీ రెండు-మూడు సమీక్షలు వచ్చాయి. పుస్తకం చదివిన తర్వాత సమీస్ఖకారులు మెచ్చుకున్నంత బావుందనిపించింది. ఈ నవతరం కవయిత్రులు ఇంద్రాణి, వైదేహి లను చదువుతుంటే కొట్టొచ్చినట్టు కనిపించే ఒక విషయం. ప్రకృతితో ఇంతగా మమేకమై కేవలం అమ్మాయిలే రాయగలరు. కవిత్వప్రేమికులు, భావుకులు చదవాల్సిన పుస్తకం. (వెల 50/- నవోదయలో, అజోవిభో ఆన్‌లైన్ షాపుల్లో దొరుకుతుంది.)
4) దేశదేశాల హైకు : పెన్నా శివరామక్రిష్ణ గారి అనువాదాలు. దేశదేశాల హైకులను ఒక్కచోట చేర్చి అనువదించిన పుస్తకం. ఈ పుస్తకం గురించి ఒక పరిచయం వ్యాసం మరెప్పుడైనా రాస్తాను. ప్రస్తుతానికి కొనుక్కోండి అనే నా సలహా. (వెల 30/- పాలపిట్ట ప్రచురణలు)
(బై ద వే, ఇవన్నీ నేను బుక్‌ఫెస్ట్‌లో పాలపిట్ట స్టాల్లో కొన్నవి. విజయవాడ వాస్తవ్యులు నాలుగుదిక్కుల తిరక్కండా మీ బుక్ ఫెస్ట్‌లో పాలపిట్ట స్టాల్లో కొనుక్కోవచ్చనుకుంటా.)

Monday, December 21, 2009
బుక్ ఫెస్టివల్ - పిల్లల పుస్తకాలు
బుక్ ఫెస్టివల్ - పిల్లల పుస్తకాలు
బుక్ ఫెస్టివల్‌కు జనరల్‌గా రెండు ట్రిప్పులేస్తాను. ఓసారి తెలుగు పుస్తకాలు కొనుక్కోడానికీ, ఓసారి ఇంగ్లీషు పుస్తకాలు కొనుక్కోడానికి. ఈ టపాలో పిల్లలపుస్తకాలగురించి నా అనుభవాలు రాస్తాను. నాక్కావలసింది, ఒకటి నుండి ఐదేళ్ళ పిల్లలకి తెలుగు పుస్తకాలు.
ఒకటి నుండి ఐదేళ్ళ పిల్లలకి చదవడమే రాదు వాళ్ళకి పుస్తకాలేమిటా అని అడక్కండి. ఆరునెల్ల వయసునుండే మనం పిల్లలకి పుస్తకాలు చదివి వినిపించొచ్చు. మొదట మనం పేజీకి ఒకే బొమ్మ ఉండే ఆపిల్, ఆరెంజ్ లాంటి పుస్తకాలతో ప్రారంభించాలి. ఒక్కొక్క పదం రిపీట్ చేస్తూ ఎంత నెమ్మదిగా చదివించినా పదినిమిషాలకంటే ఎక్కువ సమయం పట్టదు. ఆ తరువాత ఒక పేజీలో ఏదైనా ఆక్టివిటీ ఉండే పుస్తకాలు చదవడం మొదలెట్టాలి. (ఉదాహరణకి తోటమాలి మొక్కలకి నీళ్ళు పోయడం), 3-6 ఆరు నెలల్లో పిల్లలూ ఆ స్థాయి దాటేస్తారు. అప్పుడు మనం కాస్త కామిక్స్, అమర్ చిత్ర కథలాంటివి చదవొచ్చు వాళ్ళకి. ఇవన్నీ ఇంత సాధికారికంగా చెప్పడానికి నాకేమీ సైకాలజీ డిగ్రీల్లేవూ అలా అని నేను కనీసం పేరెంట్ ని కూడా కాదు. కాని అక్క/అన్నల పిల్లల మీద ఈపాటికే ప్రయోగాలు చేసి కరెష్టే అని తీర్మానించుకున్నాను.
మా ఇంట్లో ఓ మూడేళ్ళ బు(పి)డుగు. వాడికి టీవీ అట్టే చూపించొద్దని చాలా చిన్నప్పుడే వాళ్ళమ్మా నాన్న డిసైడ్ చేయడంతో దాంట్లో వాడికి పెద్ద అభిరుచి లేదు. వాడికి ఏడాది/ఏడాదిన్నర వయసున్నప్పుడు బొమ్మల కథలున్న పుస్తకాలు ముందేసి వాడికి చెబుతుంటే వాడి తిండి తినే ప్రసహనం గంటన్నర నుండి సగానికి కుదించవచ్చని, పాలు తాగే ప్రసహనం ముప్ఫై నుండి పది నిమిషాలకు కుదించవచని ఒక దేవరహస్యం తెలిసింది. ఇక అప్పుడు మొదలయ్యింది పిల్లలపుస్తకాల వేట. ఇక్కడ వాడి వయసు 1.5-3 కి మధ్య కాబట్టి వాడు స్వతహాగ చదవలేడు. అలాగే ఒక పేజీలో రెండు కంటే మించి బొమ్మలుంటే వాడికి నచ్చదు. మరి అలాంటి పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి?
విశాలాంధ్రలో/నవోదయల్లో చూడ్డం శుద్ధ దండగ. అక్కడ పిల్లల పుస్తకాలు 2-5% ఉంటాయి. అవీ తమంతట తామే తెలుగు చదువుకోగలిగే పిల్లల కోసం. ఇక Walden/AA Hussain వంటి ఇంగ్లీషు పుస్తకాల షాపుల్లో బోల్డు దేశీయ ప్రచురణలుంటాయి. అవన్ని misguided missiles లాగా ఉంటాయి. అసలు పిల్లల అభిరుచి గురించి వాళ్ళకి కాస్తైన జ్ఞానం ఉన్నట్టనిపించదు. ఒక టెక్ ఉపమానం ఇవాలంటే, బోల్డు ఇన్‌ఫర్మేషన్ పెట్టుకొని యూజర్ ఇంటర్ఫేస్ సరిగా లేని వెబ్‌సైట్లలా ఉంటాయి. ముందే చెప్పినట్టు అంత చిన్న పిల్లలకి ఒక పేజీలో ఒకటికన్నా ఎక్కువ బొమ్మలుండడం నచ్చదు. వాళ్ళ దృష్టి పరిపరి విధాలుగా పోతుంది. చివరికి నాకు దొరికినవి విదేశీ ప్రచురణలు. చక్కటి పిల్లల పుస్తకాలుంటాయి ఇంగ్లీషులో. పిల్లల్ని ఇట్టే ఆకట్టుకొనే కార్టూన్ కారక్టర్స్ గట్రా. కానీ వీటితో ఒక పెద్ద చిక్కుంది. ఒకటి - అవి ఇంగ్లీషులో ఉంటాయి. అదేం పెద్ద కష్టం కాదు, కథ పూర్తిగా మనం చదివేసి వాళ్ళకి తెలుగులో చెబితే సరిపోతుందనుకుంటే, అవి చెప్పే కథలు కూడా ఏ డిస్నీ కారక్టర్సో, ఫెయిరీ ప్రిన్సెస్‌ల గురించో ఉంటాయి. పేర్లు కూడా జాన్, టాం బార్బీ ఇవి. మాటలు నేర్చుకునే వయసులో వాళ్ళకు వాళ్ళ చుట్టూ ఉన్న పేర్లు కాక వేరే అరువు పేర్లు వినిపించడం ఎంత సబబు? మనకు బోల్డన్ని పంచతంత్రాలు, రామాయణ భాగవతాలుండగా మనకూ తెలియని, మనం రిలేట్ చేసుకోలేని డిస్నీ కథలెందుకు చెప్పాలి?
ఇలాంటి సమయంలో నాకు 2007 బుక్ ఫెస్టివల్లో చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్ బెంగళూరు వాళ్ళ స్టాలు కనిపించింది. చిల్డ్రన్స్ బుక్ ట్రస్టు వాళ్ళు చక్కగా మన భారతీయ నేటివిటీ ఉన్న కథలు పేజీకొక బొమ్మ/ ఆక్టివిటీ ఇలస్ట్రేషన్లతో ఒకే లైన్ టెక్స్ట్ తో కొన్ని పుస్తకాలు ముద్రించారు. పోలోమని బోల్డు కొనేసుకున్నా.. అందులో ఉదాహరణకి ఒక కథ చెబుతాను. ఒక చిన్న పక్షి ఉంటుంది. ఓ రోజు నోట్లో గింజ పెట్టుకొని తింటుంటే గింజ కాస్త పడి మట్టిలో కూరుకుపోతుంది. ఆ పక్షి రోజూ అక్కడికి వచ్చి వెతుకుతుంటే ఓ రోజు అక్కడ ఒక మొక్క కనిపిస్తుంది. ఇలా... ఇంకొన్ని సబ్జెక్ట్స్, మీతా అండ్ హర్ మాజిక్ షూస్, మోహినీ భస్మాసుర, దీపావళి పండగ( మావాడికి ఇదెంత ఇష్టమో) etc... ఇవి ఇంగ్లీషులోనే ఉన్నా మన నేటివిటీకి దగ్గరగా ఉండి కొంతలో కొంత మేలనిపించాయి. అదే ఏడు తార్నాక నుండి ప్రచురితమయ్యే "మంచిపుస్తకం" ప్రచురణలు కూడా చూశాను. కానీ వాళ్ళవి ఇంకా బాల్యదశలోనే ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ చిత్రాలతో పిల్లల్ని ఏమాత్రం ఆకట్టుకోకుండా ఉన్నాయి. అలాగే ముట్టుకుంటే చిరిగిపోయేట్టు. ఆ వయసు పిల్లలనుండి మనం డెలికేట్ హాండ్లింగ్ ఆశిచంలేం కదా. 2008లో కూడా సేం స్టోరీ. తెలుగులో సరైన పుస్తకాలు లేవు. పిల్లల పుస్త్కాల్లో పేజీలు కాస్త మందంగా, త్వరగా చినిగిపోకండా ఉండాలి. CBT వాళ్ళూ, మంచిపుస్తకం వాళ్ళూ ఈ విషయాన్ని పక్కన పెట్టారు. కాని రెండు కారణాల వల్ల దీన్ని క్షమించేయవచ్చు. 1) పిల్లలు ఒక కథని మహా అంటే రెణ్ణేల్లకు మించి చదవరు. అప్పటికి వారికది కంఠతా రావడమయి ఆ పుస్తకంతో పనిలేకుండా పోతుంది. పుస్తకం జీర్ణమైనా పెద్ద నష్టమేమీ ఉండదు. 2) దళసరి అట్టలు పెట్టి ముద్రిస్తే పుస్తకం ధర పెరిగిపోతుంది. ప్రస్తుతం ఇలాంటి పుస్తకాల ధర్ ఇరవయి రూపాయలు. ఈ రోజుల్లో ఇది కారు చవక ధరంటాను. కాదంటారా? ప్రతీ సంవత్సరం నేను స్టాల్ ఓనర్లతో నేరుగా మాట్లాడి వాళ్ళకి ఫీడ్‌బాక్ ఇచ్చాను. అదీ పూర్వరంగం.
ఈ సంవత్సరం 2009 ఫెస్టివల్లో తిరుగుతూ తిరుగుతూ "మంచిపుస్తకం" వాళ్ళ స్టాల్‌కి వెళ్ళి చూద్దును కదా నేకోరుకున్న పిల్లల పుస్తకాలన్నీ అచ్చ తెలుగులో. ఎంత ఆనందమేసిందో. చక్కని తెలుగులో చిన్న చిన్న పిల్లల పుస్తకాలు. ఒక్కోటీ పది-పదదహారు పేజీల పుస్తకాలు. ధర ఇరవయి రూపాయలతో అందుబాటులోనే ఉంది. ఎడా పెడా కొనేశాను.
అఫ్కోర్స్ మా వాడికి కాదు. వాడు రెండేళ్ళుగా ఇలాంటివి చదివించుకొనీ చదివించుకొనీ వివిధదశలు దాటిపోయాడు. ప్రస్తుతం ఒక మెట్టెక్కి అమర్-చిత్ర కథ సిరీస్‌లను ఎంజాయ్ చేస్తున్నాడు. రామాయణ, భారత భగవతాలు తెగ విని బాగా ముదిరిపోయీ మొన్నీ మధ్యే ప్లేస్కూల్లో టీచర్లపై ఆగ్నేయాస్త్రం వేస్తానని, డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తే బ్రహాస్త్రం వేసి గదతో కొడతానని బెదిరించాడట. సో మావాడికీ యేడు బొమ్మలు తగ్గిపోయి ఒక్కో పేరాగ్రాఫున్న పుస్తకాలు కొన్నాను. చూడాలి వాడు ఎలా రియాక్టవుతాడో.
మీరు కూడా ఈ సంవత్సరం బుక్ ఫెస్టివల్ కి వెళ్తే రెండు స్టాల్స్ చూడ్డం మరవొద్దు. 1) చిల్డ్రన్స్ బూక్ ట్రస్టు వాళ్ళది 2) మంచిపుస్తకం వాళ్ళదీ. నాకు వీళ్ళతో ఎటువంటీ లావాదేవీలు లేవు సుమీ. పిల్లలు మీవాళ్ళైనా, మీ బంధుమిత్రగణంలో వాళ్ళైనా మనం పదిమందికి పుస్తకాలు బహుమానమిస్తే కనీసం ఒక్కరికి పుస్తకాలు చదివే అలవాటు అబ్బినా అవన్నీ సార్థకమయినట్టే. ఇంకోసారి పిల్లలున్న ఇంటికి వెళ్ళేప్పుడు ఇరవయి రూపాయలు పెట్టి డైరీమిల్క్ చాక్లెట్లు కొనేకన్నా ఇలాంటి పుస్తకమొకటి ఇచ్చి చూడండి.
ఇక నా విష్‌లిస్టులో తరువాతి ఐటం. అమర్‌చిత్రకథ లాంటి సిరీస్‌లు తెలుగులో కావాలి. తెలుగు ప్రచురణకర్తలూ వింటున్నారా?
అలాగే ఈ బుక్‌ఫెస్టివల్ కి నాదో విష్ లిస్టు. ఒక ఎలక్ట్రానికి స్క్రోల్ ఏర్పరచి ఉన్న రేర్/మంచి పుస్తకాల పేర్లు/రచయితలు అవి దొరికే స్టాల్స్ లిస్టు ఇవ్వొచ్చు. అప్పుడు చాలా మందికి ఎక్కువ తిరక్కుండా టీవీ ముందు కూర్చొని పుస్తకాలు కొనేసుకోవచ్చు. ఏమంటారు.

Subscribe to:
Posts (Atom)