అనుకోకుండా ఒకరోజు మిత్రునితో కార్లో వెళ్తూ ఉంటే ఈ భజన వినిపింఛాడు. ఎవరిదీ గొంతు అమృతంలా ఉంది అని అడిగాను. అతనేమీ ప్లేబాక్ సింగర్ కాదు..అలా అని పేపర్లో అతని గురించి చదవలేదు. ఫ్రెండ్ దగ్గర సీడీ తీసుకొని గూగుల్లో వెతికాను. నాకు ఆ సింగర్ కొత్తేమో కానీ నెట్లో అతనికి బోలెడు ఫాన్స్ ఉన్నారు.
విక్రం హాజ్రా అని కేవలం భజన్స్ మాత్రమే పాడతాడు. ఎంత అద్భుతమైన గొంతో..మీరే వినండి.
ఈ పాటతో మొదలెట్టి ఇంకొన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ భజన్స్ విన్నాను. అన్నీ ఇంత గొప్పగా లేవు కాని, కొన్ని పాటలు మాత్రం మార్వలెస్.. విన్నా కొద్దీ వినాలనిపించేలా ఉన్నాయి. రిషి నిత్య ప్రఙ్య అని ఇంకో సింగర్ కూడా.. మీరు నెట్ అడిక్ట్స్ ఐతె యూట్యూబ్ లో బోలెడు పాటలు ఉన్నాయి వీళ్ళవి. నెట్లో పాటలు వినే అలవాటు లేకుంటే మాత్రం "కృస్ణ - బై విక్రం హాజ్ర", "కైలాస్ - బై రిషి నిత్య ప్రఙ్య" సీడీలు కొనండి. bang for the buck అని నా హామీ.
హబ్బో! ఎంత బాగున్నాయో ఫోటోలు! ఈ పాట చాలా సార్లు విన్నా కాని ఒక ఆవిడ పాడగా విన్నా! బాగుంది ఈయన గొంతు!మిగతావన్నీ కూడా వింటాను! ధన్యవాదాలు!
ReplyDeletevery nice... Thanks for sharing... :-)
ReplyDelete