ప్రసాద్స్‌లో ఇన్విక్టస్ పోస్టర్ చూస్తుంటే మాట్ డామన్, మోర్గన్ ఫ్రీమన్, దర్శకత్వం క్లింట్ ఈస్ట్‌వుడ్ అని కనిపించింది. అర్రె వాహ్ ఇంత మంచి క్యాస్ట్ ఉంది ఏం సినిమా అని ఇంటికొచ్చి సెర్చ్ చేస్తే మండేలా, ఫ్రాన్సువా పినార్ ల కథ అని తెలిసింది. (IPL2 పుణ్యమా అని మొన్నే ఫ్రాన్సువా పినార్ కథ తెలిసింది.) ఇక సినిమా ఇక్కడకు వచ్చేదాక వేచిచూసే ఓపిక లేక డౌన్‌లోడ్ చేసి చూశాను. (Sorry Clint, I promise I will pay and watch it on big screen again.) మోర్గాన్ ఫ్రీమాన్ అనగానే నాకు డ్రైవింగ్ మిస్ డెయిసీ, శాషంక్ రెడంప్షన్ లాంటి సినిమాలు గుర్తొస్తాయి. మంచి బారిటోన్ గొంతుతో పోషించే ప్రతిపాత్రకు ఒక ప్రత్యేకత తీసుకొస్తాడు. అలాగే మాట్ డేమన్ అనగానే గుడ్‌విల్ హంటింగ్ గుర్తొస్తుంది. వాటె బ్యూటిఫుల్ మూవీ. ఇక క్లింట్ ఈస్ట్‌వుడ్ గురించి చెప్పఖ్ఖర్లేదు. వయసు ముదురుతున్నకొద్దీ ఈ మనిషికి తెలివితేటలు ఎలా పెరుగుతున్నాయా అని ఆశ్చర్యంగా ఉంటుంది.
ఇన్విక్టస్ అంటే లాటిన్ భాషలో అజేయులు/అపరాజితులు అని అర్థం. అలాగే ఇదొక ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన కవిత. విలియం ఎర్నెస్ట్ హెన్లీ అనే కవి ఆసుపత్రిలో ఉండగా కాలు తీసేస్తామన్నప్పుడు రాసుకున్నడు. ఇక్కడ చదవొచ్చు. (http://www.poemhunter.com/poem/invictus/). మండేలాకు ఇష్టమైన కవిత అని ఈ సినిమాలో ప్రస్తావన.
ఇక కథ విషయానికి వస్తే, 1994లో దక్షిణాఫ్రికాలో జరిగిన చారిత్రక ఎన్నికల్లో జాత్యహంకారానికి మంగళం పాడి తెల్లవాళ్ళూ, నల్లవాళ్ళూ ఓట్లు వేసి మండేలాను అధ్యక్షుడుగా ఎన్నుకున్న సందర్భం. ఒక కొత్త దేశం తన చరిత్రను మరిచి, నూతన అస్తిత్వం కోసం పురిటినొప్పులు పడుతోంది. తెల్లవాళ్ళకు నల్లవాళ్ళ మీద అపనమ్మకం. నల్లవాళ్ళకు తెల్లవాళ్ళపై ద్వేషం, ప్రతీకారవాంఛ. అలాంటి సమయంలో సంయమనంతో వ్యవహరించి అందరినీ ఒక్కత్రాటికి తెచ్చి ఒక దేశాన్ని నిర్మించేందుకు ఒక మహోన్నత వ్యక్తిత్వం గల నేత కావాలి. అతనే అపరగాంధీ లాంటి నెల్సన్ మండేలా. మనం చూస్తూనే ఉంటాం. దేశప్రజలను ఏకం చేసేందుకు రెండు సులువైన మార్గాలు యుద్ధం, ఆటలు. మండేలాకు ఈ చిట్కా బాగా తెలిసినట్టుంది. రగ్బీ ఆటను పాపులరైజ్ చేసి తననుకొన్న ఆశయాన్ని కొంతమేరకు ఎలా సాధించాడో చెప్పడమే ఈ సినిమా. ఇంతకన్నా ఎక్కువ చెబితే కథలోకి వెళ్ళినట్టవుతుంది. నిజంగా సినిమా చూశాక మండేలా లేకుంటే దక్షిణాఫ్రిక ఇప్పుడున్న శాంతియుతంగా ఉండేదా లేక మరో జింబాబ్వే అయ్యేదా అన్న అనుమానం కలుగుతుంది.
ఒక బయోపిక్ సినిమాని సందేశాత్మకంగా తీసి మెప్పించడం నిజంగా కత్తిమీద సామే. కానీ క్లింట్ ఈస్ట్‌వుడ్ బాగా డైరెక్ట్ చేశాడు. ప్రథమార్థం అంతా ఒక వ్యక్తిగా మండేలా ఔన్నత్యాన్ని (ఎక్కడా అతిలేకుండా) చూపిస్తే, ద్వితీయార్థంలో ఆటలో మునిగి పోయి మనమూ కాసేపు దక్షిణాఫ్రికన్లమైపోతాము. మండేలాగా మోర్గాన్ ఫ్రీమాన్ నటన అద్భుతం. కేవలం తన నటనకోసమే ఈ సినిమా చూడొచ్చంటే అతిశయోక్తి కాదు. తప్పకుండా ఆస్కార్ ఈసారి ఫ్రీమాన్ కే వస్తుందనుకుంటున్నాను. అలాగే మాట్ డేమన్ కూడా కాస్త అండర్‌ప్లే చేసి బాగా నటించాడు. (తనకి మాత్రం ఆస్కార్ రాదు. క్రిస్టొఫర్ వాల్జ్ ఉన్నాడు కదా మరి.) స్క్రీన్‌ప్లే కి ఆస్కార్ నామినేషన్ రాకపోవడం నాకైతే ఆశ్చర్యమనిపించింది.
ఇక నాకు ఎంతో నచ్చిన రెండు డైలాగ్స్.
mandela to his bodyguards when he is questioned on recruiting white ppl,
Forgiveness starts here, too. Forgiveness liberates the soul. It removes fear. That is why it is such a powerful weapon.
mandela to his daughter when she is angry at mandela for shaking a whitemans hand
"you seek to address your own personal feelings. That does nt help the nation"
మొన్నొకమిత్రుడితో తెలంగాణ వాదం గురించి మాట్లాడుతుంటే ఒక బంగారం లాంటి మాటన్నాడు. "విడగొట్టడం చిటికెలో పని. ఎవ్వడైనా చేయగలడు. కలుపుకుపోవాలంటేనే అందరికీ చేతకాని పని అన్ని జిన్నాను, గాంధినీ ఉదహరించాడు. అదింకో చర్చనుకోండి. ఆటలు, చరిత్ర, రాజకీయాలు, బయోగ్రఫీలు, మంచి సినిమాలు వీటిల్లో దేనిపైన ఆసక్తి ఉన్నా ఈ సినిమా తప్పక చూడండి
Thursday, February 04, 2010
Tuesday, February 02, 2010
కీయ్స్ హైస్కూల్లో సంగీత కచేరీలు
అనుకోకుండా నిన్న సాయంత్రం సుధారఘునాథన్ కచేరీ ఉందని తెలిసింది. సుధారఘునాథన్ గాత్రం నేను పెద్దగా వినలేదు కానీ విన్నవి మాత్రం బాగా నచ్చాయి. సో కాస్త హై ఎక్స్‌పెక్టేషన్‌తోనే వెళ్ళాను. ఎక్స్‌పెక్టేషన్స్ ఏమీ తక్కువ కాకుండా ఇంకా ఎంతో గొప్పగా పాడారు. ఎంతైనా లైవ్ మ్యూజిక్ లైవ్ మ్యూజిక్కే అనిపించింది. శ్రోతల విన్నపం మేరకు ముత్తుస్వామి దీక్షితార్ చతుర్దశ రాగమాలిక పాడి వినిపించారు. సంగీతప్రియులకు పాతేమో కాని నేను వినడం అదే మొదటిసారి. తడవతడవకో మలుపు తిరిగే నదీ ప్రవాహంలా అనిపించింది. ఇట్ వజ్ ట్రూలీ అన్ ఎక్స్పీరియెన్స్.
రాగమాలికల గురించి నాలాంటి పామరులకోసం విష్నుభోట్ల లక్ష్మన్న గారు ఈమాటలో రాసిన వ్యాసం ఇక్కడ.
ఇక ఈ ముత్తుస్వమి దీక్షితారు రాగమాలిక ప్రత్యేకత ఏంటంటే , పాటలో పధ్నాలుగు రాగాలు వాడారు. ప్రతి రెండు లైన్లకూ రాగం మారుతుంటుంది. ప్రతి రెండు లైన్లలోనూ రాగం పేరు నిక్షిప్తమై ఉంటుంది. సాహిత్య పరంగా సంగీత పరంగా అద్భుతమైన ప్రక్రియ.
ఈ కచేరీలు శారదా కల్చరల్ ట్రస్టు వారి ఆధ్వర్యంలో త్యాగరాయ ఆరాధనోత్సవాల సందర్భంగా సికంద్రాబాద్ కీయ్స్ హైస్కూల్లో జరుగుతున్నాయి. రోజుకొకరిచొప్పున ఏడుగురు ప్రముఖ కళాకారుల కచేరీలు. పెద్ద అట్టహాసం లేదు. నాన్ - ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అట్టే పబ్లిసిటీ కూడా లేదు నాకు ఒక స్నేహితుడి ద్వారా తెలిసింది. అన్ని కచేరీలు ఉచితంగానె హాజరవ్వొచ్చు. అంతా ఉచితమయ్యేసరికి ఏర్పాట్లు కొంచెం సాదాసీధాగా ఉన్నాయి. ఆ ప్లాస్టిక్ కుర్చీల్లో కూర్చొని మూడు గంటల కచేరీ ఆస్వాదన కొంచెం కష్టమే. నేనైతే అరగంట అవగానే టెంటుల్లోంచి బయటకు వచ్చి కూర్చున్నాను. అలాగే నిన్న కచేరీ మధ్యలో పవర్ పోయింది. పాపం అంత గొప్ప కళాకారిణి, పద్మశ్రీ, కళైమామణి మన ఊరికి వచ్చి కచేరీ ఇస్తే ఇలా రసాభాస జరగడం నాకైతే చికాకు కలిగించింది. పాపం ఆర్గనైజర్సు నాన్-ప్రాఫిట్. ఉచితమైన షో. ఎవరినీ ఏమనడానికి లేదు. ఆర్టిస్టు కూడా పాపం ఎంతో మర్యాదగా, నమ్రతతో మాట్లాడారు.
ఇంకా నాలుగు రోజులు జరిగే ఈ కచేరీల వివరాలు. నేనైతే మళ్ళీ నిత్యాశ్రీ మహదేవన్ కచేరీ కి వెళ్ళాలని అనుకుంటున్నాను. కుదిరితే.
శారద కల్చరల్ ట్రస్టు- త్యాగరాజ ఆరధన ఉత్సవాలు
స్థలం : కీయెస్ గర్ల్స్ హై స్కూలు, సికంద్రాబాద్
సమయం : రోజు ఆరున్నర గంటలకు - సాయంత్రం
2 ఫిబ్రవరి - సంజయ్ సుబ్రమణ్యం - గాత్ర కచేరీ
3 ఫిబ్రవరి - G.J.R. క్రిష్ణన్, విజయలక్ష్మి - వాయులీనం
4 ఫిబ్రవరి - నిత్యశ్రీ మహదేవన్ గాత్ర కచేరీ
5 ఫిబ్రవరి - హైదరబాద్ సిస్టర్స్ - లలిత, హరిప్రియ - గాత్రం
6 ఫివ్రవరి - టీ.వీ. శంకరణారాయనన్ - గాత్రం
కుదిరితే తప్పకుండా వెళ్ళండి. 6:30 అని చెప్పినా ఏడు కి మొదలయ్యి పది వరకూ సాగుతున్నాయి. (అక్కడ భోజన సదుపాయం కూడా ఉంది. ఉచితమైతే కాదు. నాకు వేరే ప్లాను ఉండి వివరాలు సరిగా కనుక్కోలేదు.)

Subscribe to:
Posts (Atom)