ప్రసాద్స్‌లో ఇన్విక్టస్ పోస్టర్ చూస్తుంటే మాట్ డామన్, మోర్గన్ ఫ్రీమన్, దర్శకత్వం క్లింట్ ఈస్ట్‌వుడ్ అని కనిపించింది. అర్రె వాహ్ ఇంత మంచి క్యాస్ట్ ఉంది ఏం సినిమా అని ఇంటికొచ్చి సెర్చ్ చేస్తే మండేలా, ఫ్రాన్సువా పినార్ ల కథ అని తెలిసింది. (IPL2 పుణ్యమా అని మొన్నే ఫ్రాన్సువా పినార్ కథ తెలిసింది.) ఇక సినిమా ఇక్కడకు వచ్చేదాక వేచిచూసే ఓపిక లేక డౌన్లోడ్ చేసి చూశాను. (Sorry Clint, I promise I will pay and watch it on big screen again.) మోర్గాన్ ఫ్రీమాన్ అనగానే నాకు డ్రైవింగ్ మిస్ డెయిసీ, శాషంక్ రెడంప్షన్ లాంటి సినిమాలు గుర్తొస్తాయి. మంచి బారిటోన్ గొంతుతో పోషించే ప్రతిపాత్రకు ఒక ప్రత్యేకత తీసుకొస్తాడు. అలాగే మాట్ డేమన్ అనగానే గుడ్‌విల్ హంటింగ్ గుర్తొస్తుంది. వాటె బ్యూటిఫుల్ మూవీ. ఇక క్లింట్ ఈస్ట్‌వుడ్ గురించి చెప్పఖ్ఖర్లేదు. వయసు ముదురుతున్నకొద్దీ ఈ మనిషికి తెలివితేటలు ఎలా పెరుగుతున్నాయా అని ఆశ్చర్యంగా ఉంటుంది.
ఇన్విక్టస్ అంటే లాటిన్ భాషలో అజేయులు/అపరాజితులు అని అర్థం. అలాగే ఇదొక ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన కవిత. విలియం ఎర్నెస్ట్ హెన్లీ అనే కవి ఆసుపత్రిలో ఉండగా కాలు తీసేస్తామన్నప్పుడు రాసుకున్నడు. ఇక్కడ చదవొచ్చు. (http://www.poemhunter.com/poem/invictus/). మండేలాకు ఇష్టమైన కవిత అని ఈ సినిమాలో ప్రస్తావన.
ఇక కథ విషయానికి వస్తే, 1994లో దక్షిణాఫ్రికాలో జరిగిన చారిత్రక ఎన్నికల్లో జాత్యహంకారానికి మంగళం పాడి తెల్లవాళ్ళూ, నల్లవాళ్ళూ ఓట్లు వేసి మండేలాను అధ్యక్షుడుగా ఎన్నుకున్న సందర్భం. ఒక కొత్త దేశం తన చరిత్రను మరిచి, నూతన అస్తిత్వం కోసం పురిటినొప్పులు పడుతోంది. తెల్లవాళ్ళకు నల్లవాళ్ళ మీద అపనమ్మకం. నల్లవాళ్ళకు తెల్లవాళ్ళపై ద్వేషం, ప్రతీకారవాంఛ. అలాంటి సమయంలో సంయమనంతో వ్యవహరించి అందరినీ ఒక్కత్రాటికి తెచ్చి ఒక దేశాన్ని నిర్మించేందుకు ఒక మహోన్నత వ్యక్తిత్వం గల నేత కావాలి. అతనే అపరగాంధీ లాంటి నెల్సన్ మండేలా. మనం చూస్తూనే ఉంటాం. దేశప్రజలను ఏకం చేసేందుకు రెండు సులువైన మార్గాలు యుద్ధం, ఆటలు. మండేలాకు ఈ చిట్కా బాగా తెలిసినట్టుంది. రగ్బీ ఆటను పాపులరైజ్ చేసి తననుకొన్న ఆశయాన్ని కొంతమేరకు ఎలా సాధించాడో చెప్పడమే ఈ సినిమా. ఇంతకన్నా ఎక్కువ చెబితే కథలోకి వెళ్ళినట్టవుతుంది. నిజంగా సినిమా చూశాక మండేలా లేకుంటే దక్షిణాఫ్రిక ఇప్పుడున్న శాంతియుతంగా ఉండేదా లేక మరో జింబాబ్వే అయ్యేదా అన్న అనుమానం కలుగుతుంది.
ఒక బయోపిక్ సినిమాని సందేశాత్మకంగా తీసి మెప్పించడం నిజంగా కత్తిమీద సామే. కానీ క్లింట్ ఈస్ట్‌వుడ్ బాగా డైరెక్ట్ చేశాడు. ప్రథమార్థం అంతా ఒక వ్యక్తిగా మండేలా ఔన్నత్యాన్ని (ఎక్కడా అతిలేకుండా) చూపిస్తే, ద్వితీయార్థంలో ఆటలో మునిగి పోయి మనమూ కాసేపు దక్షిణాఫ్రికన్లమైపోతాము. మండేలాగా మోర్గాన్ ఫ్రీమాన్ నటన అద్భుతం. కేవలం తన నటనకోసమే ఈ సినిమా చూడొచ్చంటే అతిశయోక్తి కాదు. తప్పకుండా ఆస్కార్ ఈసారి ఫ్రీమాన్ కే వస్తుందనుకుంటున్నాను. అలాగే మాట్ డేమన్ కూడా కాస్త అండర్‌ప్లే చేసి బాగా నటించాడు. (తనకి మాత్రం ఆస్కార్ రాదు. క్రిస్టొఫర్ వాల్జ్ ఉన్నాడు కదా మరి.) స్క్రీన్‌ప్లే కి ఆస్కార్ నామినేషన్ రాకపోవడం నాకైతే ఆశ్చర్యమనిపించింది.
ఇక నాకు ఎంతో నచ్చిన రెండు డైలాగ్స్.
mandela to his bodyguards when he is questioned on recruiting white ppl,
Forgiveness starts here, too. Forgiveness liberates the soul. It removes fear. That is why it is such a powerful weapon.
mandela to his daughter when she is angry at mandela for shaking a whitemans hand
"you seek to address your own personal feelings. That does nt help the nation"
మొన్నొకమిత్రుడితో తెలంగాణ వాదం గురించి మాట్లాడుతుంటే ఒక బంగారం లాంటి మాటన్నాడు. "విడగొట్టడం చిటికెలో పని. ఎవ్వడైనా చేయగలడు. కలుపుకుపోవాలంటేనే అందరికీ చేతకాని పని అన్ని జిన్నాను, గాంధినీ ఉదహరించాడు. అదింకో చర్చనుకోండి. ఆటలు, చరిత్ర, రాజకీయాలు, బయోగ్రఫీలు, మంచి సినిమాలు వీటిల్లో దేనిపైన ఆసక్తి ఉన్నా ఈ సినిమా తప్పక చూడండి
ఈ సినిమా చూడాలని నేనూ అనుకుంటున్నానండీ!
ReplyDeleteమోర్గన్ ఫ్రీమన్ నాకు చాలా ఇష్టమైన నటుల్లో ఒకరు. డ్రైవింగ్ మిస్ డైసీ నా ఫేవరెట్ సినిమా కూడా! ఆ ముసలాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు నిత్యం గొడవ పడుతూ...చివరికి ఎంతో బావుంటుంది ఆ సినిమా! అలాగే ఆయన ఒక కమ్యూనిటీ స్కూలు ప్రిన్సిపాల్ గా నటించిన లీన్ ఆన్ మీ అనే సినిమా చూశారా మీరు?
క్లింట్ ఈస్ట్ వుడ్ కౌ బాయ్ సినిమాలు ముగిశాక మెరీల్ స్ట్రీప్ తో కలిసి ఒక సినిమా చేశాడు. పేరు గుర్తు రావడం లేదు కానీ చాలా బావుంటుంది.
మండేలా గా మొర్గాన్ నటించాడంటేనే ఆయన ఒక్కడికోసమైనా చూడాలని ఉంది.
థాంక్యూ! మంచి సినిమాని పరిచయం చేశారు.
లీన్ ఆన్ మి నేను చూశానండి. బాగుంటుంది.
ReplyDeleteమీరన్న సినిమా "బ్రిడ్జెస్ ఆఫ్ మాడిసన్ కౌంటీ" అనుకుంటా. ఆ సినిమాలో కథనం చాలా నిదానంగా ఉంటుంది కానీ నిజంగానే చాలా బాగుంటుంది. at the end of the movie i was in dichotomy on whom to sympathize with.
yes, building up relationships is often very difficult. The movie has a good ( real )story. Nice to read that Mandela's role was not over sized.This may be a movie worth watching but my thirst is already quenched. Nenu alpa santhoshini.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeletevijay gaaru, sent you a mail.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteక్లింట్ అంద్ మెరిల్ .. మీరు వెతుకుతున్న సినిమా బ్రిడ్జెస్ ఆఫ్ మేడిసన్ కౌంటి అయుండొచ్చు.
ReplyDelete