అనుకోకుండా నిన్న సాయంత్రం సుధారఘునాథన్ కచేరీ ఉందని తెలిసింది. సుధారఘునాథన్ గాత్రం నేను పెద్దగా వినలేదు కానీ విన్నవి మాత్రం బాగా నచ్చాయి. సో కాస్త హై ఎక్స్‌పెక్టేషన్‌తోనే వెళ్ళాను. ఎక్స్‌పెక్టేషన్స్ ఏమీ తక్కువ కాకుండా ఇంకా ఎంతో గొప్పగా పాడారు. ఎంతైనా లైవ్ మ్యూజిక్ లైవ్ మ్యూజిక్కే అనిపించింది. శ్రోతల విన్నపం మేరకు ముత్తుస్వామి దీక్షితార్ చతుర్దశ రాగమాలిక పాడి వినిపించారు. సంగీతప్రియులకు పాతేమో కాని నేను వినడం అదే మొదటిసారి. తడవతడవకో మలుపు తిరిగే నదీ ప్రవాహంలా అనిపించింది. ఇట్ వజ్ ట్రూలీ అన్ ఎక్స్పీరియెన్స్.
రాగమాలికల గురించి నాలాంటి పామరులకోసం విష్నుభోట్ల లక్ష్మన్న గారు ఈమాటలో రాసిన వ్యాసం ఇక్కడ.
ఇక ఈ ముత్తుస్వమి దీక్షితారు రాగమాలిక ప్రత్యేకత ఏంటంటే , పాటలో పధ్నాలుగు రాగాలు వాడారు. ప్రతి రెండు లైన్లకూ రాగం మారుతుంటుంది. ప్రతి రెండు లైన్లలోనూ రాగం పేరు నిక్షిప్తమై ఉంటుంది. సాహిత్య పరంగా సంగీత పరంగా అద్భుతమైన ప్రక్రియ.
ఈ కచేరీలు శారదా కల్చరల్ ట్రస్టు వారి ఆధ్వర్యంలో త్యాగరాయ ఆరాధనోత్సవాల సందర్భంగా సికంద్రాబాద్ కీయ్స్ హైస్కూల్లో జరుగుతున్నాయి. రోజుకొకరిచొప్పున ఏడుగురు ప్రముఖ కళాకారుల కచేరీలు. పెద్ద అట్టహాసం లేదు. నాన్ - ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అట్టే పబ్లిసిటీ కూడా లేదు నాకు ఒక స్నేహితుడి ద్వారా తెలిసింది. అన్ని కచేరీలు ఉచితంగానె హాజరవ్వొచ్చు. అంతా ఉచితమయ్యేసరికి ఏర్పాట్లు కొంచెం సాదాసీధాగా ఉన్నాయి. ఆ ప్లాస్టిక్ కుర్చీల్లో కూర్చొని మూడు గంటల కచేరీ ఆస్వాదన కొంచెం కష్టమే. నేనైతే అరగంట అవగానే టెంటుల్లోంచి బయటకు వచ్చి కూర్చున్నాను. అలాగే నిన్న కచేరీ మధ్యలో పవర్ పోయింది. పాపం అంత గొప్ప కళాకారిణి, పద్మశ్రీ, కళైమామణి మన ఊరికి వచ్చి కచేరీ ఇస్తే ఇలా రసాభాస జరగడం నాకైతే చికాకు కలిగించింది. పాపం ఆర్గనైజర్సు నాన్-ప్రాఫిట్. ఉచితమైన షో. ఎవరినీ ఏమనడానికి లేదు. ఆర్టిస్టు కూడా పాపం ఎంతో మర్యాదగా, నమ్రతతో మాట్లాడారు.
ఇంకా నాలుగు రోజులు జరిగే ఈ కచేరీల వివరాలు. నేనైతే మళ్ళీ నిత్యాశ్రీ మహదేవన్ కచేరీ కి వెళ్ళాలని అనుకుంటున్నాను. కుదిరితే.
శారద కల్చరల్ ట్రస్టు- త్యాగరాజ ఆరధన ఉత్సవాలు
స్థలం : కీయెస్ గర్ల్స్ హై స్కూలు, సికంద్రాబాద్
సమయం : రోజు ఆరున్నర గంటలకు - సాయంత్రం
2 ఫిబ్రవరి - సంజయ్ సుబ్రమణ్యం - గాత్ర కచేరీ
3 ఫిబ్రవరి - G.J.R. క్రిష్ణన్, విజయలక్ష్మి - వాయులీనం
4 ఫిబ్రవరి - నిత్యశ్రీ మహదేవన్ గాత్ర కచేరీ
5 ఫిబ్రవరి - హైదరబాద్ సిస్టర్స్ - లలిత, హరిప్రియ - గాత్రం
6 ఫివ్రవరి - టీ.వీ. శంకరణారాయనన్ - గాత్రం
కుదిరితే తప్పకుండా వెళ్ళండి. 6:30 అని చెప్పినా ఏడు కి మొదలయ్యి పది వరకూ సాగుతున్నాయి. (అక్కడ భోజన సదుపాయం కూడా ఉంది. ఉచితమైతే కాదు. నాకు వేరే ప్లాను ఉండి వివరాలు సరిగా కనుక్కోలేదు.)
nice that you have written about the concert. Sudha Raghunathan is a great artist. But why did she sing Muthuswami Dikshitulu's kriti in Tyagaraja aradhanotsavam? Why should the audience request for it?
ReplyDeleteSeriously..Even I was bit miffed with audience but artist was polite:)
ReplyDeleteFor first half of concert artist chose her songs. second half was audience-farmaayish
My mother said Nityasree sang a few Tyagaraja kritis but other composers' also. Now a days in Chennai, younger Tamil generation prefers to sing more of Tamil compositions than Telugu, though most of the Vaggeyakaras chose Telugu. Even in CHENNAYYIL THIRUVAYYARU, you find the singers selecting others' compositons.This is not completely acceptable, even according to some Tamil audience. Sudha Raghunathan's generation is still singing predominantly telugu compositions, following the tradition.And the telugu artists settled here stick to more of Tyagaraja and Annamacharya.
ReplyDeleteAbout Childrens' books ...........
ReplyDeleteRecently we bought Rama Krishna Mission's books for children, Baalala KathaaManjari, a set of 15 books, for Rs 12 each. Good books with both informative and moral stories. Your Bu(pi)dugu might like to 'hear' these stories.
We bought the books at Sec-Bad Ply Stn.
ReplyDeleteI could nt go to nityasrees concert as I was planning to but Sudharaghunathan sang all telugu songs. Inspite of the fact that audience were pretty much tamilian(guess entire padmarao nagar was there).
ReplyDeleteThanks for refering rkmath books. I have discovered them recently at rk math.
తిరువయ్యారు లో కాకుండా ఇతరత్రా జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో త్యాగరాజ కృతులే పాడాలనే సాంప్రదాయం లేదు. చాలా చోట్ల (బహుశ సికింద్రాబాదులో కూడా) త్యాగరాజ ఆరాధన అనేది కొంచెం పెద్ద యెత్తున కచేరీలు ఏర్పాటు చేసుకోవడానికి ఒక మిష మాత్రమే.
ReplyDeleteబుడుగోయ్ గారు, బ్లాగుల్లో మరో కర్నాటక సంగీత అభిమాని ఉన్నారని తెలిసి ఆనందం.
Very nice. lucky you. :-)
ReplyDeleteకొత్తపాళీ గారు, మీరు చెప్పింది నిజమే. సికంద్రాబాదు లాంటి ప్రదేశాల్లో ఆ ఉత్సవాలు కచేరీ పెట్టుకోవడానికి మిష మాత్రమే. కారణాలేవైతేనేం మాకు చక్కని అవకాశం. :) ఇక అభిమానమంటారా నాకు హిందుస్తానీ, కర్నాటిక్ రెండూ ఇష్టమే. కర్నాటిక్ చిన్నప్పటినుండీ వింటూ పెరగడం వల్ల, అంతర్లీనంగా ఉండే భక్తిరసం వల్ల కావొచ్చు. హిండుస్తానీ మీద రుచి కాస్త పెద్దయ్యాక .
ReplyDelete