డెత్లీ హాలోస్ నవల సైజ్ చూసి, ఇంత పెద్ద కథని సినిమాగా ఎలా తీస్తార్రా అనుకున్నా? రెండు భాగాలుగా తీస్తున్నారని వార్త వచ్చింది. బిజినెస్స్ పరంగా విడుదలైన ప్రతీ హ్యారీ పాటర్ సినిమా మిలియన్ల కొద్దీ సంపాదించింది. రెండు సినిమాలు తీస్తే రెట్టింపు వసూళ్ళు వస్తాయన్న ఆశకూడా కావొచ్చు. మరి సినిమా ఎలా ఉంది అంటే? నాకైతే నచ్చింది. సినిమా ఎలా ఉండొచ్చనుకున్నానో అలాగే ఉంది. హ్యారీ, హర్మైనీ సీను తప్ప :-) (ఈ పిట్ట కథ నవల్లో లేదు. డైరెక్టరు స్వకపోల జనితం)
ఇప్పటికి వచ్చిన ఆరు సినిమాలు మీరు చూసి ఉంటే ఈ సినిమా తప్పక చూస్తారు. కానీ అడపా, దడపా కొన్ని భాగాలు చూసి, కథ గురించి అట్టే తెలీకపోతే మాత్రం మీరు చూసి శుద్ధ దండగ. ఎందుకంటే సినిమాలో పాత్రలు, రిఫరెన్సులు అన్నీ పాత కథలతో ముడిపడి ఉంటాయి. అసలు రాన్ ఎవరో, హర్మినీ ఎవరో తెలియని ఒక మిత్రుడిని సినిమాకి తీసుకెళ్ళాను. పదో నిమిషం నుండి వాడికి ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. నాకు నేపథ్యం తెలుసు, నవల చదివాను కాబట్టి లీనమై చూస్తూ ఉండిపోయాను.
సినిమా కి వస్తే, ఏడవ సంవత్సరం హ్యారీ, రాన్, హర్మైనీ హాగ్వార్ట్స్ స్కూలుకి వెళ్ళడం మాని, వాల్డెమార్టునుండి తప్పించుకోడానికి దిక్కూ దివాణంలేకుండా తిరుగుతూ ఉంటారు. మినిస్ట్రీ ఆఫ్ మ్యాజిక్కి వెళ్ళి హార్‌క్రస్టు సంపాదించే సన్నివేశం చాలా బాగుంటుంది. ఆ హార్ క్రస్టు ప్రభాంతో రాన్‌కి హ్యరీ కి గొడవై వాళ్ళు విడిపోతారు. సినిమా చివర్లో మళ్ళీ కలిసి హార్‌క్రస్టును ధ్వంసం చేస్తారు. రెండవ భాగాన్ని చూడ్డం కోసం ప్రేక్షకుణ్ణి ప్రిపేర్ చేసినట్టుంటుంది కాబట్టి గొప్ప క్లైమాక్స్ ఏమీ ఉండదు. బహుశా అదే ప్రేక్షకులను నిరాశకు గురిచేయొచ్చు.
చివర్లో మా ఫ్రెండుతో పార్టు టూ బాగుంటుంది అని చెప్పబోయాను. ఇదే నా లాస్టు హ్యారీ సినిమా అని తేల్చుకున్నడట పదకొండో నిమిషంలొ :-) మీరు హ్యారీ పాటర్ ఫ్యాన్ ఐతే లేదా ఆ కథ గురించి మీకు తెలిసుంటే తప్పక చూడొచ్చు. లేకపోతె మాత్రం డబ్బులు దండగ.
నవలలో కథ గుర్తుకి లేకపోయినా సినిమాలో కథనం అర్ధమయ్యేట్టే ఉన్నది అని ఇక్కడి విమర్శకులు కితాబిచ్చారు. నేను ఈ వారాంతానికి ముహూర్తం పెట్టాను చూసేందుకు
ReplyDeleteనాతో వచ్చిన ఫ్రెండ్ కి, వీస్లీ ఫామిలీ, సిరియస్ బ్లాక్, లుపిన్, స్నేప్, ఆర్డర్ ఆఫ్ ఫీనిక్స్.. ఇందులో ఒక్కటీ తెలియవు. అందుకే వాడికి చికాకొచ్చింది మీరు పాత సినిమాలు చూసి ఉంటే, లేదా ఆ కథ మీద కాస్త అవగాహన ఉంటే తప్పకుండా చూడండి.
ReplyDeletethey are HORCRUXES..NOT...హోర్ క్రస్ట్స్...
ReplyDeleteనిజమే. పీజా తినుకుంటూ రాశానేమో :). thank you for correcting.
ReplyDeleteఇంకా రాన్ కి హ్యారీ కి గొడవ అనేది రాన్ ఇంకా హర్మైనీ కలిసి బసిలిస్క్ కోరలను తేవాలి కానీ హ్యారీ వాళ్ళతో రాకూడదు కారణం వోల్దేమార్టు హ్యారీని చంపాలనుకుంటాడు
ReplyDeleteఅందుకని కావాలని రాన్ ఈ నాటకం ఆడతాడు