1934 నవంబర్ 30: నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పండిట్ మోతీరాం అనే సంగీతకారుణ్ణి ఆస్థాన విద్వాంసుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. ఆరోజు సాయంత్రం నగరంలో చౌమొహల్లా భవంతిలో కచేరీకి ఏర్పాట్లు చేశారు. ఇంకో ఐదు గంటల్లో రాజలాంఛనాలతో వచ్చి ఆయన్ని తీసుకెళ్తారనగా విధివక్రించి పండిట్ మోతీరాం పరమపదించారు. అప్పటికి పండిట్ జస్రాజ్ ప్రాయం ఐదేళ్ళు. కుటుంబ బాధ్యత అన్న పండిట్ మణిరాం తీసుకొని తిరిగి ఉత్తరభారతానికి వెళ్ళిపోయారు. మొదట్లో కాస్త తబ్లా నేర్చుకొన్న జస్రాజ్ గారు, ఎంత నేర్చిన తబ్లా వాద్యకారులు రెండవ శ్రేణి పౌరులే అన్న విషయం గ్రహించి గాత్రసంగీత సాధన చేశారు. గురువు అన్న పండిట్ మణిరాం. గానగంధర్వుడైన బడే గులాం అలీ ఖాన్ యువ జస్రాజ్ ని చూసి ఆయన దగ్గర శిష్యరికం చేయమని అడిగారు. (హిందుస్తానీ సంప్రదాయంలో ఒక గురువే శిష్యుణ్ణి ఇలా అడగడం సామన్యమైన విషయం కాదు). అప్పటికే మేవాతీ సంప్రదాయంలో సాధన చేస్తున్న జస్రాజ్ సున్నితంగా తిరస్కరించి సాధన కొనసాగించారు.
జస్రాజ్ గురించి ఇంకో పిట్టకథ ఉంది. ఆయన అర్ధాంగి ప్రఖ్యాత సంగీత దర్శకుడు వి.శాంతారాం కుమార్తె. శాంతారాం గారు సినిమాల్లో పాడు మంచి భవిష్యత్తు, ఆర్థిక బలం వస్తాయని చెబితే, రూపాయికోసం చేతిలో ఉన్న పావలాని వదులుకోనని చెప్పారట. ఏది రూపాయి? ఏది పావలా :-)
పండిట్ జస్రాజ్ తండ్రి పండిట్ మోతీరాం సమాధి హైదరాబాద్‌లోనే ఉంది. ఆయన స్మృత్యర్థం 1972 నుండి ఏటా నగరంలో నవంబర్ 30 వ తేదీ సంగీతోత్సవం నిర్వహించే సంప్రదాయానికి స్వీకారం చుట్టారు జస్రాజ్. 2008 వరకు వివిధ వేదికల్లో నిర్వహించిన ఈ ఉస్తవాణ్ణి 2009 నుండి, వాళ్ళ తండ్రి గారు ఒకప్పుడు కచేరీ నిర్వహించవలసిన చౌమొహల్లా భవంతిలోనే నిర్వహిస్తున్నారు.
ఆ ఉత్సవాల్లో భాగంగా నేడు పండిట్ జస్రాజ్ కచేరీ. ప్రవేశ రుసుము లేదు. మక్కామసీదు దగ్గర చౌమొహల్లా పాలస్ ఆరుబయట జరుగుతోంది. చక్కగా తొమ్మిది తొమ్మిదిన్నర వరకు చేరుకుంటే రాత్రి పన్నెండు వరకు జరుగుతుంది.
హిందుస్తానీ సంగీతం అభిమానించే వారైతే కచేరీ తప్పక వినవలసిందే. its really an out of world experience.
good that you have briefed the life history of Pt Jasraj. I now understand that he takes his own (right) decisions and doesn't get disturbed by what others say.
ReplyDeleteVery interesting and nicely written.Thanks!
ReplyDelete