చిన్నప్పుడు పావల అద్దెకి తెచ్చుకొనే నవల్లో ఒక రిపీటెడ్ థీం ఉండేది. ఒక రాజకుమారిని రాక్షసుడు ఎత్తుకుపోయి ఎక్కడో దీవుల్లో దాచిపెడతాడు. రాజుగారు రాజ్యమంతా చాటింపు వేస్తారు. రాజకుమారిని వెతికి తెచ్చిన వారికి రాకుమారినిచ్చి పెళ్ళి చేయడమో లేదా అర్ధరాజ్యమివ్వడమో లాంటి బహుమతిస్తామని. రాజాగారి దగ్గరకి ఒక ముగ్గురు యువకులు వస్తారు. మొదటివాడి దగ్గర రాజకుమారి ఎక్కడ ఉందో కనుక్కునే దుర్భిణి ఉంటుంది. రెండవ వాడి దగ్గర అక్కడికి తీసుకు వెళ్ళే మాయా తివాచి ఉంటుంది. మూడవా వాడు వెళ్ళి ఆ రాక్షసుడితో యుద్ధం చేసి రాజకుమారిని విడిపిస్తాడు. ఇప్పుడు రాజకుమారిని ఎవరికిచ్చి పెళ్ళిచేయాలని ధర్మసందేహం రాగా యుద్ధం చేసినవాడికే దక్కాలని మంత్రి తీర్పిస్తాడు.
ఈ మధ్య 3 ఇడియట్స్ గురించి ఫైవ్ పాయింట్ సంవన్ నవల రచయిత చేతన్ భగత్ కూ, రచయితలు రాజూ హీరానీకి, అభిజాత్ జోషీకి జరిగిన గొడవ చూస్తే మళ్ళీ ఇదంతా గుర్తొచ్చింది. ఒక కథ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? ఒరిజినల్ రచయితకా? ఆ కథను తీసుకొని ఇంప్రూవైజ్ చేసిన వాళ్ళకా? ఎప్పుడు ఎవరు కొట్టుకుంటారా అని వేచి చూసే మీడియా వెంటనే రంగంలోకి దిగి కొన్ని అవుటాఫ్ కంటెక్స్ట్ కోట్లని సంపాదించి లేని దుమారం సృష్టించింది.
ఆ నవలనూ, సినిమానూ బాగా ఎంజాయ్ చేసిన నాకు వీళ్ళకు గొడవలేంట్రా అని కాస్త నెట్లో వెతికితే తేలింది ఇది.
2004లో చేతన్ భగత్ మెగా సక్సెస్‌ఫుల్ నవల ఫైవ్ పాయింట్ సంవన్ పుస్తకం వచ్చింది. కథ చాలా సింపుల్. ముగ్గురు ఇంజనీరింగ్ కుర్రాళ్ళు ఆకతాయి పనులు చేస్తూ ఆఖరుకు కాలేజీలోంచి డిస్మిస్ చేసే పరిస్థితి తెచ్చుకొని చివరికి కాస్త తెలివితో కాస్త శ్రమతో గట్టెక్కుతారు. యువతకు సంబంధించిన థీం ఉండడం వల్ల, కేవలం 95 రూపాయలకు దొరకడం వల్ల పుస్తకానికి విపరీతమైన ఆదరణ లభించింది. దాదాపు పదిలక్షల పుస్తకాలు అమ్ముడు పోయి భారతీయ ఆంగ్ల సాహిత్య చరిత్రలో ఒక రికార్డు సృష్టించింది. చేతన్ భగత్ నవల్లన్నీ సినిమాను దృష్టిలో పెట్టుకొని రాసినట్టే ఉంటాయి. రెండేళ్ళయ్యాక వీవీసీ కంపనీ వాళ్ళు పుస్తకానికి పదకొండు లక్షలు చెల్లించి సినిమా హక్కులు కొనుక్కున్నారు. అంతవరకు బాగుంది. ఈ ప్రాజెక్టులోకి ఆమిర్ ఖాన్ అంత గొప్ప స్టార్ రాగానే ప్రాజెక్టు మీద అంచనాలు భారీగా పెరిగాయి. నవల్లో మూడు పాత్రలకూ సమమైన ప్రాధాన్యత ఉంటుంది. మరి ఆమిర్ ఖాన్ అలాంటి సినిమాలో ఇంకొ ఇద్దరు నటులకు ప్రాధాన్యత ఇస్తూ ఎలా నటించగలడు? నవల్లో కాస్త హీరోయిక్ లక్షణాలుండే పాత్ర రైయన్‌ది. సూత్రధారి పాత్ర రాజుది. వీవీసీ వాళ్ళు రయన్ పాత్రనిడివి పెంచి, రాజు పాత్రను కేవలం సూత్రధారిగా మలిచి రయన్ పాత్రకు గుడ్‌విల్ హంటింగ్ లో మేట్ డేమన్ బాగ్రౌండ్ లాంటిదిచ్చి రయన్ పాత్ర ఉదాత్తంగా మలచారు. పూర్తిగా మార్చారా? కాదు. ఇంతకు ముందే నా బ్లాగులో చెప్పినట్టు కొంచెం 5.1, కొంచెం పాచ్ ఆడంస్ తీసుకొని కొంత ఒరిజినాలిటీ తీసుకొని మొత్తానికి మంచి చిత్రాన్నే తీశారు.
చిక్కెక్కడ వచ్చిందయ్యా అంటే, సినిమాలో ముందర వచ్చే టైటిల్స్ లో కథ : రాజూ హీరానీ, అభిజాత్ జోషీ అని ఉంటుంది. చేతన్ భగత్ కి క్రెడిట్ ఎక్కడో సినిమా అయ్యాక రోలింగ్ క్రెడిట్స్ లో వస్తుంది. సినిమా అయ్యాక చేతన్ భగత్ బ్లాగులో కథ70% తనదేనని మూల పాత్రలు మొత్తం నవల్లోంచి తీసుకొని, కీలకమైన మలుపులు కూడా వాడుకున్నారు గావున తనకు కథ క్రెడిట్స్ ఇవ్వాలని అక్కసుగా రాసుకున్నాడు. అసలు బాలివుడ్‌లో హక్కులు కొనుక్కోవడమే లేదు అలాంటిది తాము చక్కగా పదకొండు లక్షలిచ్చి కొనుక్కుని 90% మార్చుకున్నాం తము చేసిన తప్పేంటి? చేతన్ భగత్ పబ్లిసిటీ గిమ్మిక్కులివన్నీ అని వీవీసీ వాళ్ళు గొడవ చేశారు. పనిలో పనిగా ఆమిర్ ఖానుతో ఇలాంటి స్టేట్మెంట్ ఇప్పించారు. వాళ్ళు రాసుకున్న అగ్రిమెంట్లూ చూపించి ఇందులో మేం చేసిన తప్పేంటని ప్రశ్నించారు.
ఏతావాత తేలిందెంటంటే వీవీసీ వాళ్ళు చక్కని లీగల్ ఒప్పందం కుదుర్చుకొని ఒప్పందం ప్రకారమే నడుచుకున్నారు. చట్టపరంగా వాళ్ళను తప్పు బట్టడానికి లేదు. చేతన్ చెప్పిన దాంట్లోనూ తప్పేమీ లేదు. నవల్లోంచి 70% కాకపోయిన 50% ఐతే కథ తీసుకొన్నారు కాబట్టి తనకి కథ క్రెడిట్స్ ఇవ్వాలి. చేతన్ అసలే IIT, IIM గ్రాడ్యుయేట్. అలాంటిది ఈ సినిమా వాళ్ళ మాయలో పడి అలాంటి అరకొర ఒప్పందమ్మీద ఎందుకు సంతకం చేసినట్టు? హీరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్ళు ఒప్పందం ప్రకారమే నడుచుకున్నారు తప్పులేదు. కానీ కథ 50% పోలికలు, కాలేజి సెట్టింగులు, మూల పాతలు, కొన్ని ప్రధాన సంఘటనలు నవల్లోంచి తీసుకుంటే నవలాకారుడికి క్రెడిట్ ఇవ్వొద్దా?
చాలా రీసెంట్ఆ స్లం్‌డాగ్ మిలియనీర్ హక్కుల్నీ ఇలాగే కొనుక్కుని కథను సినిమాకు అనుగుణంగా మార్చుకొని సినిమా తీశారు. కానీ స్లండాగ్ నిర్మాతలు, రచయితలు, దర్శకుడు ప్రతి ఇంటర్వ్యూలో రచయిత వికాస్ స్వరూప్ కి క్రెడిట్టిస్తూనే ఉన్నారు. సినిమా టైటిల్స్ లో కూడా వికాస్ కు కథ- కిందర్ క్రెడిట్టొస్తుంది. ఎవరో హాలివుడ్ వాళ్ళు న్యాయంగా ఉన్నప్పుడు బాలివుడ్ వాళ్ళు ఎందుకిలా చేస్తున్నారు? హక్కులు కొనుక్కొని సినిమాలు తీయడాలూ ఇవన్నీ మనకు కొత్త కాబట్టి ఇలాంటి తప్పులు జరుగుతున్నాయా?
రాజూ హీరానీ, కథకు మీరెన్ని మార్పులు చేసినా కథ మీ సొంతమైతే కాదు. చట్టపరంగా మీరు కరెక్టేనేమో గాని ఎథికల్‌గా ఐతే కాదు. అసలు హాలివుడ్ నుండి ఇన్ని ఫ్రీమేకులు చేసి అతికించిన సీన్లతో సినిమాలు తీసి కథ మాది అంటే ఎలా? నాకైతే రాజూ హీరానీ మీద గౌరవం పదినుండి ఒకటికి వచ్చింది. ఇక చేతన్ భగత్ అంటారా? చేతన్, IIT, IIMలో చదివిన వాడివి. ఈసారైనా కాంట్రాక్టు క్షుణ్ణంగా చదివి సంతకం పెట్టడం నేర్చుకో.
Agree with you. Both of them need to grow up and get on with their lives
ReplyDeleteIts controversial and may be advertising trick also...
ReplyDelete(1999 - 2009) TOP-20 తెలుగు కథానాయికల్ని మీరే ఎంచుకోండి!
visit to poll:
http://blogubevars.blogspot.com/
అనుకోకుండా కొందరి పేర్లు TOP-20 లిస్టు లో పెట్టలేక పోయాను, అక్కడ ఉన్నవారికి మీ వొటు వేయండి.
బుడుగు గారూ 1
ReplyDeleteబాలీవుడ్ కే కాదు టాలీవుడ్ లోను ఇదే పద్ధతి వుంది. ఆ మాటకొస్తే ప్రపంచమంతా వ్యాపించివున్న దోపిడీలో భాగమే ఇది కూడా !
ఈనాటి ఆనందమయ మకర సంక్రాంతి
అందించాలి అందరి జీవితాలకు నవ్య క్రాంతి
*** మీకు, మీ కుటుంబానికి, మీ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ***
SRRao
శిరాకదంబం
http://sirakadambam.blogspot.com/2010/01/blog-post_13.html