పండక్కి విడుదలైన బోలెడు స్టార్ సినిమాల మధ్యలో ఈ చిత్రాన్ని ఎవరూ పట్టించుకున్నట్టు లేదు. రెండు ప్రధాన వెబ్‌సైట్లు తెలుగుసినిమా.కాం, ఐడిల్ బ్రెయిన్లలో కూడా ఈ సినిమా ఊసు లేదు. ప్రసాద్స్‌కి వెళ్తే ఒక్క ఈ సినిమాకే టికెట్స్ దొరుకుతున్నాయి అని చెబితే సరే నవదీప్, కాజల్ ఐతే బానే చేస్తారు కదా పర్లేదని కొన్నాం. తీరా సినిమాలో కూర్చున్న తర్వాత నాతో వచ్చిన వాళ్ళెవరికీ నచ్చకపోయినా నాకైతే ప్రిడిక్టబుల్ స్టార్ సినిమాలకన్నా ఇదే బాగుందనిపించింది.
ఐదేళ్ళ క్రితం హాలివుడ్‌లో క్రాష్ అనే ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా వచ్చింది. ఆ రైటర్ పాల్ హాగిస్ కు ఆస్కార్ కూడా సంపాదించి పెట్టిన చిత్రమది. సినిమాలో ఒక ఏడెనిమిది కథలు పారలల్‌గా సాగుతుంటాయి. చివరకు అన్నీ ఒకో చోట కలిసి slice of life తరహాలో ముగుస్తాయి. ప్రతీ కథలో అంతర్లీనంగా జాత్యహంకార చిత్రణ ఉంటుంది. ఇలాంటి పారలల్ థ్రెడ్స్ మాడల్ క్రాష్ లోనే మొట్ట మొదట వాడారా అన్నది ఎవరైనా సినిమా చరిత్రకారులెవరైనా చెప్పాలి. ఈ ఓం శాంతి చిత్రం కూడా ఇదే తరహాలో ఉంటుంది. ఐదు చిన్న కథలు పారలల్‌గా నడిచి ఒక చిత్రమైన ముగింపులో కలుస్తాయి.
నవదీప్ కథ నేటి ఐ.టీ ఇంజనీర్ల జీవితానికి ప్రతీక. ఉద్యోగం ఉన్నన్నాళ్ళూ విలాసవంతమైన జీవితాలూ, ఉద్యోగం ఊడితే వచ్చే రకరకాల ఒత్తిళ్ళూ చాలా రియలిస్టిక్‌గా, బోరు కొట్టించకుండా ఉంటుంది. నవదీప్ నటన బాగుంది. ఈ కథలో సునిల్ కామెడీ బాగా పండింది. ఇక రెండో కథ కాజల్ ది. జీవితాన్ని ఓ ఆటగా తీసుకొనే థ్రిల్ సీకింగ్ మెంటాలిటీ కాజల్‌ది. అర్ధరాత్రి స్మశానాల్లో ఆడపిల్లలూ కొంచెం సత్య దూరంగా ఉండి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. ఇలాంతివే ఇంకా కొన్ని రాండం యాక్ట్స్ ఉంటాయి. కానీ సినిమా మధ్యలో కాజల్ పాత్రతో ప్రేక్షకులు ఎంపథైజ్ అవుతారు. ఈ పాత్రకు చక్కని ముగింపు ఇచ్చాడు దర్శకుడు. ఇక మూడో కథ ఉన్న ఊర్లో భూములమ్ముకుని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దూకుదామని ప్రయత్నించే ఒక కొడుకు పాత్ర. (ఈ నటుడెవరోనాకు తెలీదు. ) ఈ కథ కూడా చాలా బాగా చిత్రీకరించారు. తల్లి పాత్రకు మేకప్ మాత్రం కామెడీ అనిపించింది. ఇక నాలుగో కథ హాపీ డేస్ నటుడు నిఖిల్ ది. సినిమా మోజులో పడి సిటీకి వచ్చి మోసపోయే అనేకమంది ఔత్సాహికుల కథ. ఈ కథలో బోలెడంత కామెడీ జొప్పించ చూశాడు దర్శకుడు. నటనంతా ఓవర్ ద టాప్ గా ఉంది చాలా మట్టుకు చికాకు కలిగిస్తుంది. శివారెడ్డి వంటి ప్రతిభాశాలికి అలాంటి చెత్త పాత్ర ఇచ్చి సరైన న్యాయం చేయలేదు. ఈ కథలో స్క్రిప్టు ఇంకొంచెం మంచిగా రాసుకొనుండాల్సింది. ఇక ఐదో కథ బిందుమాధవిది. ఈ అమ్మాయికి నటనకి పెద్ద ఆస్కారంలేని చిన్న పాత్రనిచ్చారు. ఒక మిలిటరీ కాప్టెంతో పెళ్ళి నిశ్చయమయి, అతని కోసం వేచి చూస్తుంటుంది. తన అన్నేమో టెర్రరిస్టు. ఐదు కథలు వేటికవే ఒక సినిమా తీయగల నిడివి ఉన్న కథలు. వీటిని ఇరవయి నిమిషాల్లోకి కుదించాల్సేసరికి అన్నీ చాలా స్టీరియో టైపెడ్ గా తయారయ్యాయి. మొత్తానికి తెలుగు సినిమాల్లో ఇదో ప్రయోగమనే చెప్పొచ్చు.
సినిమా ప్రయోగాత్మకంగా ఉండడం బానే ఉన్నా ఎవరైనా గట్టి స్క్రీన్ ప్లే రైటరు దొరికుంటే ఇంకొంచెం బాగా పండి ఉండేది అనిపించింది. కాజల్ కథ చాలా అసంబద్ధంగా ఉంటుంది. కాస్త పకడ్బందీగా రాసుకొనుండాల్సింది. సినిమాలో నిఖిల్ కామెడీ కంటే సునిల్ కామెడీకే జనాలు బాగా రియాక్టయ్యారు. అలాగే టెర్రరిస్టు ఆంగిల్ ని చాలా అన్‌రియలిస్తిక్ గా చిత్రీకరించారు. బాంబు డిజైన్లు చక్కగా చార్టుల్లో గీసి ఇంట్లో పెట్టుకుంటారా ఎవరైనా? సినిమా సంగీతం ఇళయరాజా అని గంపెడాశలు పెట్టుకుంటాం. ఒక పాట మినహా మిగిలిన సంగీతం ఓఖే అనిపిస్తుంది. దర్శకుడు సరిగ్గ వాడుకోలేదో మరెంటో..డైలాగు రైటర్ బాగున్నాడు. నాకు నచ్చిన రెండు డైలాగులు..
1)ఎక్స్క్యూజ్ మి. మీరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లా?
అవును..ఎలా కనుక్కున్నారు?
మరేం లేదు. మీరిద్దరే ఐనా రెండు పిజ్జాలు ఆర్డర్ చేసి సగం సగం వదిలేస్తేనూ..":)
2)తెల్లారి లేస్తె మట్టిని కళ్ళకద్దుకునేవాళ్ళం మనకు నెలకు లక్ష ఖర్చులు అవసరమట్రా?
ఎప్పుడూ ఒక హీరో, హీరో చేతిలో తన్నులు తినే విలన్లూ, తిట్టినా, ఇన్సల్టు చేసినా వాణ్ణే ప్రేమించే హీరోయినూ, ఓ ఐటం సాంగూ, హీరో పక్కన తొట్టి గాంగు తో కొంచెం కామెడీ లాంటి దినుసులు కూర్చుకొన్న ఫార్ముల చిత్రాలతో మీరు విసుగెత్తి పోయుంటే, మీలాంటి వారికి ఇది ఒక వెల్కం బ్రేక్. అలా కాక స్టార్ వాల్యూ చూసి ఎంజాయ్ చేసే టైపైతే మీరు దూరంగా ఉండడమే మంచిది.
ఈ సినిమాకు వెళ్ళడం వల్ల నాకు దక్కిన అడిషనల్ బోనస్ ఏంటంటే.మా ముందు వరసలో కూర్చొని సినిమా చూసిన కీరవాణి, రాజమౌళిలతో మాట్లాడ్డం :) both of them were gentlemen with no starry airs.
చూడలైతే.. మీ సమీక్ష బాగుంది
ReplyDeleteప్యారలెల్ నెరెటివ్ అనేది మనతెలుగులో కొత్తేగానీ హాలీవుడ్లో 1916 లోనే ఈ ప్రయోగం జరిగిపోయింది. రొషొమాన్ లాంటి సినిమాలు వీటిస్థాయిని ప్రపంచసినిమాకు చూపిస్తే, హిందీలో ‘సూరజ్ కా సాత్వాఘోడా’ హృద్యంగా దాన్ని భారతీయ తెరమీదకు తీసుకొచ్చింది.
ReplyDeletevery nice review...
ReplyDeleteమహేశ్ గారు, రషోమొన్ లో ఉన్నది multiple points of view ప్రక్రియ. నాకు తెలిసి multiple threads అమోరే పెర్రోస్ లో మొదలయ్యిందనుకుంటా. నేను చూసిన వాటిలో అదే పాతది.
ReplyDeleteమీ సమీక్ష బాగుంది.
ReplyDelete@బుడుగు: మల్టిపుల్ నెరేటివ్ స్ట్రక్ర్ లో ప్యారలెల్ నెరెటివ్, పాయింట్ ఆఫ్ వ్యూ నెరెటివ్ అనేవి ప్రక్రియలు మాత్రమే. ఒకే కథను విభిన్నకోణాల్నుంచీ చూపినా, వివిధకథల్ని ఒకటిగా జతచేసినా రెంటినీ మ్,అల్టిపుల్ నెరేటివ్ అొచ్చనుకుంటాను
ReplyDeleteGriffith's Intolerance (1917)సినిమాల్లో ఈ కథాక్రమానికి ఆద్యమని చెబుతారు.