చాలామందికి (నాక్కూడా) ఆడవాళ్ళకు డ్రైవింగ్ - డైరెక్షన్ సెన్స్ సరిగా ఉండదని, మగవాళ్ళు ఆడవాళ్ళంత బాగా మల్టి-టాస్కింగ్ చేయలేరని నమ్మకం. (ఓకే ఓకే ఈ జనరలైజేషన్ కు ఏ బేసిస్ లేదు. కావున కామెంట్లతో హోరెత్తించకండి). అదే కాదు నాకు డ్రైవింగ్ స్కిల్స్ మీదా, డిరెక్షన్ సెన్స్ మీదా ప్రగా...ఢ నమ్మకం. దానికితోడు, నేనే గ్రూప్‌లో ఉన్నా డైరెక్షన్స్ నన్నే అడుగుతూ ఆ నమ్మకాన్ని వమ్ము కానివ్వలేదు బంధుమిత్రగణం. కాని మొన్న మాత్రం నాకు మాంచి గుణపాఠమయ్యింది.
చెప్పాను కదా తబ్లా కచేరీకని వెళ్ళి జస్రాజ్ మాయలో పడి పన్నెండున్నర వరకు చౌమొహల్లా పాలస్‌లో ఉండిపోయానని. వేళ్ళేప్పుడే నాకు కాస్త చిరాకేసింది. ఇంత మెయిన్ రోడ్లు పట్టుకు తిరగాలా షార్ట్ కట్ లో వెళ్తే బాగుండు అని. సరే ఇక తిరుగు ప్రయాణం లో వచ్చిన దారి కాదని ఓ నాలుగు కార్లు అఫ్జల్‌గంజ్ వైపు వెళ్తుంటే వాటిని ఫాలో అయ్యా. ఓ రెండు కిలోమీటర్ల దూరం నాకు పైలట్ వాహనాల్లా వచ్చి అటొకటి ఇటొకటి మలుపులు తీసుకున్నాయి. ఫాలో అవుదామంటే మరీ చిన్న గల్లీలు. సరే ఇప్పుడు వెళ్ళే రోడ్డు పెద్దదే గదా అని తిన్నగా వెళ్ళా కాసేపు. తిన్న్నగా వెళ్తే ఏ పురానపూలో, నయాపూలో వస్తుందనుకుంటే ఎంతకూ రాదే? సరే మూసేసిన దుకాణాల బోర్డులు చూస్తే అదేదో హుస్సేనీ ఆలం అని తెలిసింది. అయ్య బాబోయ్. ఎక్కడో ఓల్డ్ సిటీ గల్లీలో ఉన్నానని అర్థమయ్యింది. రాత్రి దాదపు ఒకటవుతోంది. ఒకటే చలి. నేను వేసుకున్నది హాఫ్ స్లీవ్స్ కాటన్ షర్టు. ఐసింగ్ ఆన్ ది కేక్ లా బండి రిజర్వ్లో పడి అప్పటికే ఓ యాభై కిలోమీటర్లయ్యింది. (బంద్ అని బంకుల దగ్గర క్యూలు ఉంటే నేను బద్ధకించా రిటర్న్‌లో ఎక్కడో పోయించవచ్చులే అని).
ఇక చూసుకోండి. లేని పోని ఊహలన్నీ వస్తున్నాయి. అంతలో GHMC రోడ్ బ్లాక్ కనిపించింది. అంతవరకు నాతో వచ్చిన బైకర్ రైట్ తీసుకుంటే సరే నేనూ రైట్ తీసుకున్నా. ఒక వందడుగులుపోగానే వాడు చక్కగా పార్క్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళాడు. నేను బిక్కమొగం వేసుకొని యూ టర్న్ తీసుకున్నా. అప్పటికీ నా సిక్స్త్ సెన్స్ ముందుకు సాగూ ఈ మాత్రం దానికి వెనక్కి తిరుగుతావా అని హేళన చేస్తోంది. మళ్ళీ మెయిన్ రోడ్ మీదకు రాగానే ఒకతను రోడ్ బ్లాక్ అవతలనుండి ఇవతలకి రావడం చూశా. హమ్మయ్య దొరికాడు.
"భాయ్ సాబ్, యే రస్తా కిధర్ జాత?"
"పురానా పూల్"
(హ హ..నా కాంఫిడెన్స్ మళ్ళీ పదిరెట్లయ్యింది.)
"గాడీ జా సక్తి క్యా?"
"థొడా సంభల్ కె జావో"
(ఓకే. గ్రీన్ లైట్)
శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అనుకుంటూ చీకట్లో కష్టపడి గుంతల్లోంచి బండిని అవతలికి తీసుకెళ్ళి కాస్త దూరం వెళ్ళగానే ఒక టూ వే మెయిన్ రోడ్.
యా...బేబీ..దేర్ యు గో. అనుకుంటూ లెఫ్ట్ టర్న్ తీసుకొని ఒక రెండు కిలోమీటర్లు వెళ్ళాను. ఎంతకీ మూసీకి ఆవలి వైపు వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ కనిపించదే? మళ్ళీ పప్పులో కాలేసానా? అనుకుంటూ అక్కడెవరో బైకర్ని అడిగా.
"యే రస్తా కిధర్ జాతీ?"
"షంషాబాద్"
ఓర్నాయనో అసలే పెట్రోల్ లేదంటే ఈ దారమ్మట వెళ్తే ఇంతే సంగతులు అనుకుంటూ మళ్ళీ యూ టర్న్.
తీరా చూస్తే నేనూ ఇంట్యూషన్ తో లెఫ్ట్ కొట్టా కానీ, ఒకసారి కనీసం రైట్ వైపు కన్నేసినా పురానాపూల్ ఎటో తెలిసేది. ఏమయింది నాకివాళ - డైరెక్షన్ సెన్స్ బొత్తిగా పనిచేయట్లేదు అనుకుంటూ ఒక ఆర్టీసి బస్సును ఫాలో అయ్యాను. దాదాపు పురానాపూల్ వరకు వెళ్ళాక తెగించి ఇంలిబన్ వరకు ఏం వెళ్తాం లే అని ఒక బ్రిడ్జ్ కనిపించగానే లెఫ్ట్ కొట్టేసా. బ్రిడ్జ్ ఆవలికి చేరితే అసలు అఫ్జల్ గంజే కనిపించదు..
ఓ షూట్. మళ్ళీ దారి తప్పానా? అని ఒక పెద్ద రోడ్డు కనిపించగానే తిన్నగా వెళ్ళా..
ఆ వీధంతా బేగంబజార్ టోకు సామానుల వాసన. హమ్మయ్య సరైన దార్లోనే ఉన్నా.. కాస్త తిన్నగా వెళ్ళి బేగంబజార్ రోడ్డెక్కితే చాలు అనుకొని వెళ్తున్నా.. ఎంతకీ మెయిన్ రోడ్ రాదె??
మరొకసారి జై ఆంజనేయం ప్రసన్నాంజనేయం..దారి అడుగుదామంటే చింకిపోగులేసుకొని ఒక హోంలెస్ ఫెలో కనిపించాడు. వీణ్ణి కెలకాలా వద్దా అనుకుంటూ
"భాయ్ సాబ్, యే రస్తా కిధర్ జాతీ?"
ఆహ్?
"సీధ గయే తో కిధర్ జాతే"?
(ఇంతలో ఇంకొకడు అక్కడికి వచ్చాడు. వీడు వాడితో ఎందట ఈన గొడవ కొంచెం చెప్పురా అని ఆర్డర్ వేసి వెళ్ళిపోయాడు).
ఓ షూట్. చక్కగా తెలుగులో అడిగా.
"నువ్వెక్కడికి బోవాలె?"
అప్పటికి అఫ్జల్గంజ్ దాటానని గెస్ చేసి నాంపల్లి అని చెప్పా.
"సీధబొయి లెఫ్ట్ తీసుకుంటే మొజంజాహి మార్కెట్. తెలుసుగద?"
"ఆ తెలుసు తెలుసు".
ఈ రోజు నాకేదో మూడిందని ఇంకోసారి రాత్రిపూట గల్లీల్లోకి దూరనని లెంపలేసుకుంటూ రజనీకాంత్ పాట పాడుకున్న.
"దేవుడా దేవుడా ..తిరుమల దేవుడా...ఉన్నావా ఉన్నావా..నువ్వసలున్నావా?"
ఎంత తిన్నగా వెళ్ళినా లెఫ్ట్ తర్న్ ఎక్కడ తీసుకోవాలో తెలిసింది గాదు. ఒకచోట మాత్రం పెద్దగా లైట్లు కనిపించాయి. సరే మన అదృష్టం చూఒద్దామని తిన్నగా వెళ్ళి చూస్తే అదో పెట్రోల్ బంక్.
ఆహ్..తిరుమల వాసా నువ్వింత తొందరగా ప్రార్థనలు వింటావా..ఐతే పెద్ద కోరికేదో కోరుకుందునే అనుకుంటూ పాట మార్చాను.
"దేవుడ దేవుడా తిరుమల దేవుడా.. ఉన్నావౌ ఉన్నావు నువ్ గ్యారంటిగున్నావు. ఇవాళ నన్నెందుకు పరీక్ష చేస్తున్నావు?"
బంకులో పెట్రోల్ పోయించి కాస్త ఊపిరి పీల్చుకొని,
"భాయ్ సాబ్, నాంపల్లి కైసే జానా?"
"ఇట్ల సీధ బొయి లెఫ్ట్ తిరుగుతే నాంపల్లి".
లెఫ్టా? టొటల్ల్య్ అన్ - ఇంట్యూటివ్ గ చెప్తున్నాడే వీడు?? వినాలా వొద్దా? కొంపతీసి వెనకే ఎవరినన్నా పంపించడుకదా? ఆలోచిస్తూ సీధా వెళ్ళి లెఫ్ట్ తిరిగి ఎందుకైనా మంచిది అని ఒకరినడిగా.
"కహా జాన హై తుంకో?"
"నాంపల్లి"
"యెహీ నాంపల్లి హై"
ఇదేవిటీ? చాయమాత్రంగానైనా అనిపించట్లేదు?
"ముఝే స్టెషన్ జానా హై"
"తొ పీచే జావో"
సరేనని వెనక్కి తిరగ్గానే పేద్దరోడ్డు. అరగంటగా నేను చలిలో వణుకుతూ, టెన్షన్ టెన్షన్ గా వెతుకుతున్న రోడ్డు. బతుకుజీవుడా అంటు ఇంటిదారి పట్టాను.
కాస్త ముందుకెళ్ళి ప్రాణం కుదుటపడ్డాక ఇంతమంది సరైనదారి చెబితే, వాళ్ళ అవతారాలు చూసి, ఒక్కణ్ణీ నమ్మక ఆ రోడ్లు గల్లీల్లో టెన్షన్ వల్లో ఏమో ఒక్కరికి థాంక్స్ చెప్పలేదని గుర్తొచ్చింది. ఛ ఛ. ఎంత సిగ్గుచేటు..ఒకసారి పాలగుమ్మి పద్మరాజు గాలివాన కథ గుర్తొచ్చింది.
నా డైరెక్షన్ సెన్సునూ, ఓవర్ కాంఫిడెన్స్ ని తిట్టుకుంటూ, దేవుడికి క్షమాపణలు చెప్పి లెంపలేసుకుని వెచ్చగా ఇంట్లోకి వచ్చిపడ్డా. అదీ సంగతి.
>>"ఆహ్..తిరుమల వాసా నువ్వింత తొందరగా ప్రార్థనలు వింటావా..ఐతే పెద్ద కోరికేదో కోరుకుందునే"
ReplyDeleteపెద్ద కోరికలు కోరుకొని ఉంటే, ఇంటికి తిన్నగా చేరేవారు కాదేమో... :):):)
బుడుగు గారు, మీ ఎక్స్పీరియన్స్...చాలా బాగా...బుడుగు లాగానే ఉంది.
ReplyDeleteహ హ హ ..మొత్తానికి అర్ధ రాత్రి హైదెరాబాద్ రోడ్ లన్ని గింగిరాలు తిరిగేరన్నమాట బుడుగు.
ReplyDeleteనాగప్రసాద్ గారు మీరు కామెంటడం బావుందండీ. నేను మీ సైన్సు బ్లాగుకి పెద్ద ఫాన్‌ని.
ReplyDeleteజయ గారు, బావనగారు ఇప్పుడాలిచిస్తే ఫన్నీగానే ఉంది గానీ ఆ రోజు బంద్ కదా. ఎక్కడ పోలీసులు పట్టుకుంటారోనని టెన్షన్. ఏమైనా అడిగితే my story would have looked like a bad lie.
బుడుగు గారికి, నమస్కారములు.
ReplyDeleteమీ కధ, మీరు తిరిగినన్ని గల్లీలు తిరిగి, హాస్యాన్ని పండించింది.
భవదీయుడు,
మాధవరావు.