తెలుగు సినీ పరిశ్రమకు 75ఏళ్ళు నిండిన సందర్భంగా ఇప్పటివరకు వచ్చిన మంచి సినిమాల మీద వ్యాసాలు, కబుర్లతో వెలువరించారీ పుస్తకాన్ని. దాదాపు ఐదారు వేలసినిమాల్లోంచి మంచి చిత్రాలు ఎన్నటం కత్తిమీద సామువంటిది. అందరిని మెప్పించడం జరగనిపని. కావున అలాంటి వివరాల్లోకి వెళ్ళనే వెళ్ళను. ప్రతి సినిమాకు తారాగణం, సాంకేతిక వర్గం, పాటల వివరాలు, మరీ మైల్‌స్టోన్ సినిమా ఐతే దర్శకులతో చిన్నపాటి బ్లర్బ్‌లు, అలాగే సినిమా సక్సెస్ వివరాలు బానే పొందుపరిచారు. ఈ పుస్తకానికి చదివింపగుణమూ ఉంది. కాని ఈ పుస్తకంలో సోల్ లేదు.
ఇలాంతి పుస్తకం రాయడానికి రచయితకు కనీసం మూడు అర్హతలు ఉండాలని నా అభిప్రాయం. 1) సినిమాలని ప్రేమించి, ఆరాధించాలి2) సినిమా సాంకేతికత గురించి కాస్తో కూస్తో తెలిసుండాలి3) రాసే భాషలో మంచి పట్టుండి, ఆకట్టుకొనే వచనం రాయగలగాలి..
పులగం చిన్నారయణకి మొదటి రెందున్నాయో లేవో కానీ, మూడవదైతే ఖచ్చితంగా లేదు. ఉదాహరణకు తెలుగువెలుగులు లాంటి వ్యాససమహారాన్ని, ఏదో పీ.ఎచ్.డీ ప్రాజెక్టుకు రాసినట్టు రాస్తే ఎలా ఉండేదో ఊహించుకోండి. అదే రమణ, పిలకా గణపతి లాంటి దిగ్గజాలు రాస్తే ఎలా వచ్చింది చూడండి. అదీ సంగతి.
ఈ పుస్తకం గురించి నాకో మేజర్ కంప్లైంటు. వెల. రెండు వందల డెబ్భయ్యైదు రూపాయలుట. అసలు ఈ పుస్తకానికి టార్గెట్ ఆదియెన్స్ ఎవరు? ఎన్నారైలైతే పర్వాలేదు. సగటు ఆంధ్ర జీవులైతే మాత్రం ఈ పుస్తకాన్ని కొనడానికి అన్నేసి డబ్బులు దండగ అనే చెబుతాను. కోతికొమ్మచ్చి లాంటి హాట్ కేకు పుస్తకాలు (మంచి ప్రింటు క్వాలిటీతో) నూట ఏభై రూపాయల్లో దొరుకుతుంటే ఏంటట వీరి గొప్ప. ఇంతేసి ధరలు పెట్టి మళ్ళీ ఆంధ్రలో పుస్తకాలు కొనట్లేదు కొనట్లేదు అనడం మాత్రం రచయితకు తగదు.
ఇట్లు మీ....
baagane blaagaaru kani inkocham vipalmgaa blagandi ...
ReplyDelete