వారమంతా ఎక్కడ చూసినా మగధీర ఎంత బాగుందోనని చెప్పుకోవడమే. హైప్ కాస్త ఎక్కువైనపుడు చాలా సార్లు సినిమాకి వెళ్ళి మనం నిరాశ పడిపోతాం. కానీ ఈ సినిమా నిజంగా హైప్‌కు తగ్గట్టే ఉంది. ఈపాటికి మీరు బోలెడన్ని సార్లు చదివి ఉంటారు. కాని తెలుగు తెరపై సాంకేతికంగా ఇంత మంచి చిత్రం ఒక చారిత్రక మలుపనే అనుకుంటున్నాను. సినిమలో కొన్ని సన్నివేశాలు బెన్-హర్, టెన్ కమాండ్‌మెంట్స్ ను గుర్తుకు తెచ్చేలా ఉనాయి. సో, తప్పకుండా చూడమనే చెబుతాను. థియేటర్లోనే చూడండి.
ఈ సినిమా పూర్తిగా డైరెక్టర్‌దే. ఆ సెట్లు, ఆర్టూ, స్క్రీన్ ప్లే అబ్బో..అనుకునేలా ఉన్నాయి. చాలా సన్నివేశాలు 300, హీరో (చైనీస్), సినిమా ను తలపింపజేస్తాయి. హీరోయిన్ కూడా బాగా నటించింది. చరణ్‌కు మాత్రం పూర్తి మార్కులు పడవు. ఇంకా డిక్షను ఇంప్రూవ్ చేసుకోవాలి. అరుంధతిలో సోనూ సూద్ విలనీ చూశాక, ఈ కొత్త విలన్ అట్టే నచ్చడు.
మొత్తమ్మీద ఈ సంవత్సరం మనకు రెండు మైల్‌స్తోన్ చిత్రాలు. అరుంధతి, మగధీర. సాంకేతికంగా మనమూ హాలివుడ్ లెవెల్లో తీయగలమని ఈ రెండూ చిత్రాలూ నిరూపించాయి. ఇక తదుపరి అడుగు ఒరిజినాలిటీ దిశగా వేయాలి. ఇకపై మన సృజనాత్మకతకు ఆకాశమే సరిహద్దు. అరుంధతిలో అంధురాలు ఢంకాలతో నృత్యం చేసే అద్భుత సన్నివేశం చైనీస్ సినిమా house of flying daggers నుండి స్పూర్తి పొందిందని తెలిస్తే మనసు చివుక్కుమంటుంది. అలాగే మగధీరలో కొన్ని సన్నివేశాలు.. కమాన్ గైస్.. lets be original.
ఇట్లు మీ..
నాకైతే తెగ నచ్చేసింది ఈ సినిమా. ధియేటర్ నించి బైటికి వచ్చాక కూడా ఆ అనుభూతి నించి బైటికి రాలేకపోయాను. పాటల్లో ధీర ధీర ధీర, పంచదార బొమ్మ బాగా నచ్చాయి.
ReplyDeleteఅయ్య..! బుడుగు గారు.. తమరు బెన్-హర్ చిత్రం చూసారా..? అలాగే టెన్ కమాండ్ మెంట్స్ చూసారా..? మగధీరని వాటితో పోల్చి వాటి గౌరవాన్ని కించపరచినట్లైంది, వాటంతటి క్లాసిక్ మగధీరలో ఎక్కడన్న మచ్చుకైనా కనపడుతుందా..? కనీసం ఒక్క సీనన్న గుర్తుండే పోయేలా చిత్రీకరించారా..? మగధీర సినిమా అంతా గ్రాఫిక్స్ గోల, హడావుడి తప్ప ఎక్కడ ఒక్క సీన్ లో కూడ ఇన్ వాల్వ అయ్యే పరిస్థితే లేదు, పోనీ గ్రాఫిక్స్ అన్న కనీస గరిష్ట స్థాయిలో ఉన్నాయా అంటే అవి లేవు..చాలా చోట్ల తేలిపోయాయి, ఉదా" చరణ్ అగ్ని లోనుండి దూకే సన్నివేశాల్లో ఆయన చేతులకి అంటుకున్న అగ్ని అటు ఇటూ కదులుతూ ఉంటుంది ఒకే చోట ఉంటూ కాలుతూ ఉండకుండ ఇలాంటివి చాలానే కనపడతాయి, ఒక వాస్తవం చెప్పాలంటే అంత భారీ బడ్జెట్ పెట్టుకొని ఒక మంచి ఆణిముత్యం తీయగలిగే అవకాశాన్ని పోగొట్టుకున్నారు రాజమౌలి, మల్లి అలాంటి బారీ బడ్జెట్ రాదేమో అతని జీవితం లో..!.
ReplyDelete