Tuesday, August 25, 2009

బాబోయ్.. వినాయక చవితి

చిన్నప్పుడు వినాయక చవితి ఎప్పుడొస్తుందని ఎంతగా ఎదురుచూసేవారమో. నేను పెరిగింది ఒక చిన్న ఊర్లో. గోదావరి ఒడ్డున. అప్పటికింకా జనాల మీద కేబుల్ దండయాత్ర జరగలేదు. కేవలం డీడీ చానల్ తో టీవీ ప్రభావం ఎక్కువ ఉండేది కాదు. తొమ్మిది రోజులూ భజనలు, ప్రసాదాలు, గణపతులు చూస్తూ ఊరంతా ఒకటే తిరగడం. ఇక తొమ్మిదోరోజు గోదావరి దగ్గర పెద్ద ఉత్సవం. ఫాస్ట్ ఫార్వర్డ్ ఇరవి యేళ్ళు. వినాయక చవితి వస్తుందంటే వామ్మో ఈ తొమ్మిది రోజులు ఎక్కడికైనా పారిపోదామనిపిస్తోంది.
అసలు హైదరబాద్ లాంటి నగరాల్లో ఉండడమే ఒక పెద్ద పనిష్మెంటు. బడికి వెళ్ళాలన్న, ఆఫిసుకి వెళ్ళాలన్నా ట్రాఫిక్ మహాసాగరాలు ఈదాలి. పీల్చడానికి మంచి గాలి ఉండదు. కాస్త సాయంత్రం ఎక్కడైనా తిరిగొద్దామంటే అట్టే జనాలు లేని పార్కులుండవు. వీకెండ్స్ ఆడుకుందామంఏ ఓ గ్రౌండు దొరకదు. క్వాలిటీ ఒఫ్ లైఫ్ ఎంత వరస్టుగా ఉంటుంది. వీటన్నిటికి తోడు ఈ తొమ్మిది రోజులు వినాయకుని పేరు చెప్పి సాయంత్రాలైతే చాలు మైకులతో హోరెత్తిస్తుంటారు. ఒకే వీధిలో రెండు మూడు వినాయకులు ఒకరితో ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఎందుకొచ్చావురా దేవుడా అనుకునేలా చెస్తారు. పొద్దున్నే ఆరింటికే మైకుల్లో సుప్రభాతాలు, సుందరకాండలు. ఎమ్మెస్ సుబ్బులక్ష్మిని కూడా కాసేపు నిశ్శబ్దంగా ఉండవమ్మ తల్లీ అనాలనిపిస్తుంది. పొరపాటున ఎవరినైనా ఆపమన్నామో మనం మొత్తం కాలనీకి, అపార్టుమెంటు కాంప్లెక్సుకి శతృవులమైతాం. భక్తి కాస్త ఉన్మాదంలోకి మారిపోతుంది. ఏ రోజుకి వాళ్ళు ఐదు సార్లు మైకుల్లో అరుస్తుంటే ఎప్పుడూ అడగరే? అని దానికి కమ్యూనల్ రంగు పులుముతారు. ఇదంతా చూస్తే ఎప్పుడో చర్చిల్ అన్న మాట గుర్తు వస్తుంది. I dont have a problem with christ but with christians నాకూ అదే అనాలనుంది. దేవుడా నాకు నీతో సమస్యలేదు కాని నీ భక్తులనుండి మాత్రం నన్ను రక్షించు.
తా. క. ఇలాంటిదే తిలక్ కవిత ఏదో ఉన్నట్టు గుర్తు, కుదిరితే ఇక్కడ పోస్టు చేస్తాను.

11 comments:

 1. :) నిజమేనండి. చిన్నప్పటి నించి నే అమెరికా వచ్చే వరకూ ఒక్క ఏడాది కూడా పాటల ఫ్లోతో సహా ఏదీ మారలేదు. ఏక్తా కపూర్ సీరియల్స్ లో కథలు మారనట్టే ఈ పాటలు కూడా మారేవి కాదు. అవే పాటలు విని విని ఒక రకమైన విసుగు వచ్చేది. ఇంక నిమజ్జనం టైంలో అయితే చెప్పక్కరలేదు. అసలు ఢమ ఢమ అంటూ డ్రంస్ పట్టుకుని ఒక నాలుగైదు గంటలు చెవులు దిబ్బళ్ళేసుకుపోయేట్టు మ్రోగించి కానీ వినాయకుడిని కదల్చరు. ఆ వినాయకుడు కూడా అంతంత చెవులు పాపం ఎలా మూసుకోవాలో తెలీక ఈ గోల భరించలేక ఆ విగ్రహం లో నించి ఎప్పుడో పారిపోయే ఉంటాడు. వీళ్ళు మటుకు నానా భీభత్సం చేసి కానీ ముందుకి కదలరు. పైగా పక్క సందువాళ్ళతో పోటీ. నిమజ్జనం తర్వాత రెండురోజులు సైగల భాషే. ఎందుకంటే రెండురోజులవరకు చెవులు దిబ్బళ్ళేసుకుపోయి ఏమీ వినిపించవు కాబట్టి.

  But still that was fun. :p

  ReplyDelete
 2. బాగుందండి మీ బ్లాగు.ఇప్పుడే చూస్తున్నాను.nice reviews.దేముడి పేరుతో ట్రాఫిక్కు కి జరిగే ఇబ్బందిని మాత్రం నేనూ హర్షించనండి..

  ReplyDelete
 3. @పద్మ గారు: అమెరికాలో ఉన్నప్పుడు నేనూ అలాగే అనుకున్నాలెండి. oh..it was so much fun అని. అసలు మీరు సిటీలో గణేషునిపేరుతో జరిగే గందరగోళం చూస్తే తెలుస్తుంది మీకు. తృష్ణగారు చెప్పిన ట్రాఫిక్ జాంస్ ఇంకా నేను మెన్షన్ చేయనేలేదు.
  @తృష్ణ గారు: బోళ్డు థాంక్సండీ..

  ReplyDelete
 4. దిబ్బళ్ళేసుకుపోయి :)
  పద్మ గారు మీరు గబుక్కున చెప్పాలి మీది గుంటూరు కదా??

  ReplyDelete
 5. avunandi... patala horu perigindi... maa chinnappudu maadi palleturu.. akkada ithe ekamga recording dance pettevallu....kakapote 5 rojule chesevallu lendi adrushtam bagundi.....

  ReplyDelete
 6. బుడుగు గారూ, నేను చెప్పింది ఇండియాలో ఉన్నప్పట్టి విషయమే. స్కూల్/కాలేజ్ రోజుల్లో. నేను మరీ చిన్నగా ఉన్నప్పుడు కర్ఫ్యూకి పెట్టింది పేరు మా ఊరూ, వినాయకచవితి. :) కానీ నిజంగానే అదొక సరదాగా ఉండేదండి. ఆ మోత అదీ చిరాకు తెప్పించినా, రకరకాల వినాయకుళ్ళని చూడటం , రోజూ ఈనాడు పేపర్లో ఎక్కడ ఎటువంటి వినాయకుడిని పెట్టారో ఇంటెరెస్టింగ్ గా చదవటం నాకైతే బావుండేవి. నిజం చెప్పండి. పదకొండు రోజులు అయ్యాక, ఖైరతాబాద్ వినాయకుడిని కూడా నిమజ్జనం చేసాక మీరు హమ్మయ్య గొడవ వదిలింది అని రిలీఫ్ ఫీల్ అవుతారా లేక మిస్ అయినట్టు ఫీల్ అవుతారా? (మొదటిది అయితే మీది ఆదరాబాదరా కాదు.)

  రాజేంద్రగారూ, కాదండి నేను పుట్టింది పెరిగింది ఆదరాబాదరా అనబడే ఊరు. కాకపోతే రూట్స్ గుంటూర్ జిల్లాలెండి. మాతాపితరులు గుంటూరు జిల్లావారు. ' దిబ్బళ్ళేసుకుపోయి ' మరీ అంత గుంటూరు మార్కు అంటారా? :)

  ReplyDelete
 7. అంత ఖచ్చితంగా చెప్తున్నారు అంటే మీది గుంటూరేనా? అయ్యుండచ్చనే నేనూ అనుకుంటున్నాను ఎందుకంటే నా ఫ్రెండ్స్ లో ఈ మాట పలకగలిగేవారిని ఎవరినీ చూడలేదు. వాళ్ళల్లో ఎవరిదీ గుంటూరు కాదు. :)

  ReplyDelete
 8. అవునండి,అది చాలా టిపికల్ గుంటూరుజిల్లా పదం

  ReplyDelete
 9. పద్మ గారు, సందేహమే లేదండీ. నేను పెద్ద గొడవొదిలిందనే అనుకుంటాను :) కానీ మీకెందుకు నచ్చుతుందో అర్థమైంది. చిన్నప్పటినుండి పుట్టి పెరిగిన ఊరంటే ఆమాత్రం అభిమానం ఉండాలి. ఇంకో జీవితకాలం గడిపినా హైదరాబాద్ నాదనుకోలేను. నా దృష్టిలో నదో, సముద్రమో లేని ఊరు ఊరే కాదు :) (మూసీలు, హుస్సేన్ సాగర్లు కాదు)

  ReplyDelete
 10. ఏం చెప్పను? మా ఇంటివెనకాలే పెట్టారు మండపం! రోజంతా సినిమా ట్యూన్లతో కూర్చిన గణపతి పాటలతో ("ఆ అంటే అమలా పురం" ట్యూన్ తో కూడా)హోరెత్తి పోతోంది జీవితం. అలవోగ్గా నేను కూడా గొంతు కలుపుతూ చప్పున "ఛ" అని ఆపేస్తున్నా! ఈ పది రోజులూ పవర్ కట్ ఉంటే ఎంత బాగుండనిపిస్తోందో!

  ReplyDelete