Saturday, December 05, 2009

కవిత్వంపై ఆసక్తి ఉంటే

కవిత్వంపై ఆసక్తి ఉంటే ఒకసారి ఈ ఉత్తరం చదవండి.

బాబూ,

ఈ పరిస్థితి తాత్కాలికం. క్రమక్రమంగా వికలమైన వాతావరణం ప్రశాంతమౌతుంది. ప్రకృతిలో పరివర్తన అనూహ్యం. మబ్బు కురిసినప్పుడే కురిసి అంతలోనే దూదిపింజల్లా తేలిపోతుంది. గాలి వీచినట్టే వీచి అదేమిటో హఠాత్తుగా స్తంభించిపోతుంది. ఎర్రగా పొడిచే పొద్దు ఒక్కొక్కమాటు కమిరిపోయినట్టు కనిపిస్తుంది. పరిసరాల్లో జరిగే దుష్పరిణామాలకు ప్రత్యక్షసాక్షి మనిషి. అన్నిటినీ చూసేది తానే. అన్నిటిని అనుభవించేది తానే. మంచిని గాఢంగా హత్తుకుంటూ చెడును కాలి గొనగోటితో చిమ్మేసుకుంటూ కాలం మూపు మీద స్వారీ చేస్తూ స్వచ్చందంగా పురోగమించినప్పుడే మనిషి మనుగడ సార్థకమవుతుంది.

ఇట్లు,
మీ నాన్న.

ఉత్తరం బావుందా? కష్టాల్లో ఉన్న మనిషికి స్వాంతన చేకూర్చే వచనాలు కదూ. నాకైతే ఫరవాలేదనిపించింది.

దీనికి కవిత్వానికి ఏమిటి సంబంధం అంటారా?

నవంబరు 30న ఆంధ్రజ్యోతి వివిధలో ప్రచురితమయిన ఒక కవిత చదువుతున్నాను. ఏమిటిది? కవితా? లేకపోతే పర్సనాలిటీ డెవెలప్మెంట్ క్లాసా అని అనుమానం వచ్చింది. ఆ కవితలో సింహభాగాన్ని యధాతథంగా తీసుకొని దానికి 1)బాబూ 2) ఇట్లు మీ నాన్న అని రెండు పదాలు కలిపాను అంతే. ఇది రాసింది ఒక ఘనత వహించిన గోప్ప కవి. తెలుసుకోవాలంటే నవంబరు 30 న వివిధ తిరగేసి "దుష్పరిణామాలు" కవిత చదవండి.

ఇప్పుడు చెప్పండి ఇది కవిత్వమా?

14 comments:

  1. దాని లింకుగాని, స్కాను కాపీ గానీ పెడితే ఇక్కడే చదువుకొనేవాళ్ళం కదా!

    ReplyDelete
  2. నేను ఇది చదువుతూవుంటే,ఎప్పుడో తెలుగు పుస్తకంలొ చదివిన ..పరవస్తు చిన్నయ సూరి రాసిన "జీవనము బుద్భుద ప్రాయము,యవ్వనము ఝరీ వేగతుల్యము,అర్థములు సత్యములు కావు ....." అనే వాక్యాలు గుర్తుకొచ్చాయండి.

    ReplyDelete
  3. ఉదయాన్నే హోంవర్క్ చేయించారు. ఆంధ్రజ్యోతి చూడటం మానిన చాలా రోజులకి ఆ లింక్స్ చూసేలాచేసారు.

    కానీ ఎందుకో ...

    ReplyDelete
  4. http://www.andhrajyothy.com/main/vividha.pdf

    ReplyDelete
  5. పాఠకులను ఇబ్బందిపెడదామనో, ఆంధ్రజ్యోతి సైటును పాపులర్ చేద్దామనో ఉద్దేశ్యం కాదు. కవి పేరు తెలిస్తే ఆబ్జెక్టివ్ గా చదవలేమేమో అని. ఇంకా సస్పెన్స్లు వద్దులెండి.
    ఇది సినారె కవిత.

    ReplyDelete
  6. ఉష గారు, ఎందుకిలా చేశానంటారా.. మన జ్ఞానపీఠులవారి కవిత్వఝలక్ ఒకటి పాఠకులకు చూపిద్దామని. ఆయన అకవిత్వం రాశాడు సరే, ఎడిటర్లు ఏం చేస్తున్నారు? ఇలాంటివి పేపర్లను ఆక్రమించుకొని రోల్ మోడల్స్ గా నిలుస్తుంటే మంచి కవిత్వం ఎలా వస్తుంది? అందుకనే ఈ షోకేసింగ్.
    ఇలాంటివే గోప్ప గోప్ప కవులు కిరణ్ గారు (http://amtaryaanam.blogspot.com) అపుడపుడు షోకేస్ చేస్తున్నారు. తనకి ఇతోధికంగా సహాయం చేద్దామని.

    ReplyDelete
  7. హ హ హ.
    అందరు గొప్పగా చెప్పే శ్రీ సి.నా.రె. స్థాయితో పోలిస్తే, మంచి వచనం కూడా కాదగ్గది కాదు ఈ రచన. ఇక కవిత్వం సంగతి దేనికి?

    నిజానికి కొన్ని బ్లాగుల్లో వచ్చే రచనలకి ఏమాత్రమూ తీసిపోదని కూడ చెప్పుకోవచ్చు. అలా అని, ఆ బ్లాగులను విమర్శించాననుకోవద్దు. వాళ్ళు సి.నా.రె.కి ఏమాత్రమూ తీసిపోరనే చెబుతున్నాను.

    ReplyDelete
  8. విమర్శకులు విశ్వంభర చదివారా? అది అర్థమయి వుంటే ఈ విమర్శ చేసి ఉండేవారు కాదు. కవిత అంటే ఇలా వుండాలని కొన్ని సూత్రాలు చెప్పి ఆ తరువాత మీరనుకున్న సూత్రాలను ఇది పాటించలేదు కాబట్టి ఇది చెత్త కవిత అని విమర్శిస్తే మా లాంటి వాళ్ళకు ఓహో ఈ కవిత ఇలా ఈ సూత్రాల చట్రంలో ఇమడలేదు కాబట్టి పరమ చెత్త కవిత అని అర్థమవుతుంది కదా!
    "క్రమక్రమంగా వికలమైన వాతావరణం ప్రశాంతమౌతుంది. ప్రకృతిలో పరివర్తన అనూహ్యం. మబ్బు కురిసినప్పుడే కురిసి అంతలోనే దూదిపింజల్లా తేలిపోతుంది. గాలి వీచినట్టే వీచి అదేమిటో హఠాత్తుగా స్తంభించిపోతుంది. ఎర్రగా పొడిచే పొద్దు ఒక్కొక్కమాటు కమిరిపోయినట్టు కనిపిస్తుంది"
    కవిత చదివాక ఈ వాక్యాలు ప్రకృతి గురించి చెప్పినట్టుగా అర్థమయిందా మీకు?

    ReplyDelete
  9. This comment has been removed by the author.

    ReplyDelete
  10. విమల గారు,
    మొట్టమొదట కవి పేరు చెప్పనిది కూడా ఇందుకే. కవితను ఆబ్జెక్టివ్ గా చదవండి. మంచి కవితో కాదో నిర్ణయించుకోండి. ఈ కవితలో కవిత్వం చూడండంటే విశ్వంభరను ఎందుకు గుర్తు చేస్తునారు. (విశ్వంభర గొప్ప కావ్యమని కాదు. ఆ చర్చ ఇక్కడ అప్ర్స్తుతం.)
    మీరు నా బ్లాగును మళ్ళీ చదవండి. దాంట్లో కవిత్వానికి నేను ఏ సూత్రాలు చెప్పానో, ఈ కవితను వాటిలో ఎలా ఇరికింపజేస్తున్నానో తోటి పాఠకులకు చెప్పండి. నాక్కూడా.

    మీరు కోట్ చేసిన వాక్యాలు ప్రకృతి వర్ణనా అని అడిగారు. ఆ ఉత్తరంలో తండ్రి కొడుక్కి ప్రకృతి గురించి రాస్తున్నాడా? మీరు చెప్పండి.

    కాసేపు వీరాభిమానాన్ని, విశ్వంభరను పక్కన పెట్టి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పండి.
    1) ప్రకృతిని ఇలా వర్ణించడం ఇదే మొదటి సారా?
    2) ఈ వర్ణనను దుష్పరిణామాల contextలో వాడుకోవటం ఇదే మొదటి సారా?

    ReplyDelete
  11. "కుర్చీలు విరిగిపోతే
    కూర్చోడం మాననట్లు, గొప్ప రచనలన్
    కూర్చే శక్తి నశిస్తే
    చేర్చదగునొకింత చెత్త సిరిసిరి మువ్వా!"

    అని ఎప్పుడో చెప్పేశారు శ్రీశ్రీ. ఆయన పరిస్థితే అలా ఐతే సినారె ఒహ లెఖ్ఖా!

    ReplyDelete
  12. ఇష్టం ఉన్నా లెకున్నా, ఒక్కోసారి ఆబ్లిగేటరీగా వేస్కోవాల్సి వస్తుంది కదండీ... సినారె ఇచ్చాక, రిజెక్ట్ చేస్తే ఏమౌతుందో? అన్న ఆలోచన ఎవరికన్నా ఉంటుంది కదా... ఎడిటర్ల కష్టాలు ఎడిటర్లవి. మనం కూడా వాళ్ళనే అనుకుంటున్నాం చూశారా.....దీన్నెలా వేస్కున్నారూ? అని :) పాపం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందొ! ఏమంటారు?

    ReplyDelete
  13. (lekhini not working for some reason. pardon this english reply)
    I can empathize with editors. But some one has to bell the cat. And every time and editor publishes such stuff, he is refusing space for a young/better writer.

    ReplyDelete