Monday, August 03, 2009

లవ్ ఆజ్ కల్

లవ్ ఆజ్ కల్
నాకసలు హిందీ సినిమా చూడాలంటే ఎక్కడలేని నీరసం వస్తుంది. హాలివుడ్ సినిమాల్లా కథనం ఉండదు, తెలుగు సినిమాల్లా కామెడీ ఉండదు. వెరసి చూడాలని ఆసక్తి ఉండదు. ఏడాది కాలంగా మిత్రులతో చూసి చూసి ఇప్పుడు అవీ అలవాటయ్యాయి. మగధీరకు టికెట్లు ఎలాగూ దొరకవని ఈ సినిమాకు వెళ్ళాం. డైరెక్టర్ ఇదివరకు జబ్ వి మెట్ తీసినతనే.
సినిమా కాస్త నిదానంగా నడుస్తుంది. పూతరేకులంత పలుచని కథాంశం. (wafer thin plot) :). బోరు కొట్టించకుండా సినిమా తీయడం కష్టమే. సినిమాలో రెండు కథలు నడుస్తుంటాయి. ఒకటి నేటి తరానికి సంబంధించిన ప్రేమాయణం. ఒకటి నిన్నటి తరానిది. సినిమాకు సైఫ్ నటనే పెద్ద బలం. గత ఏడేనిమిదేళ్ళుగా సైఫ్ నటనను మలచుకొన్న తీరు అద్భుతం. నిన్నటి తరమంటూ చూపించిన కథ చాలా బాగా తీశారు. సాంకేతికంగా నూటికి నూరు మార్కులు వేయొచ్చు. పాటలు మాత్రం నాకు ఆట్టే నచ్చలేదు. కథ వివరాల్లోకి ఎక్కువగా పోను. మీకు drama genre సినిమాలు నచ్చితే తప్పక చూడండి. థియేటర్‌లో కాకపోయినా...డీవీడీలో మాత్రం ఒకసారి చూడొచ్చు. సైఫ్ నటనకోసమైనా. అలాగే పాత తరం కథలో హీరోయిన్ కోసం ;-)ఓవరాల్, ఈ దర్శకుడినుండి ఇంకొన్ని మంచి సినిమాలు ఆశించొచ్చు. -బు

3 comments:

  1. "డైరెక్టర్ ఇదివరకు జబ్ వి మెట్ తీసినతనే."
    వామ్మో ఐతే నే చూడ నే చూడ!

    ReplyDelete
  2. సినిమా బోర్ కొట్టింది.

    ReplyDelete
  3. కొత్తపాళీ గారు,
    మీరు నిఝ్ఝెంగా అమాయకులండీ. దేశీ సినిమాల్లో లాజిక్కు చూస్తారా ఎవరైనా..
    పద్మార్పిత గారు, సినిమా కాస్తా ని..దా..నం...గా నడిచింది. నిజమే..

    ReplyDelete